.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -64 లో..... నందు కోసం మురళి మల్లెపూలు తీసుకొని వస్తాడు.అందరు నందుని గట్టిగా పట్టుకుంటే మురళి మల్లెపూలు పెడతాడు. అవి తీస్తే నా మీద ఒట్టు అని పెద్దావిడ అనగానే నందు సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత అందరు పడుకున్నాక నందు నిద్రలేస్తుంది. ఆకలిగా ఉంది. ఇప్పుడు ఎలా అని మురళి తీసుకొని వచ్చిన స్వీట్ తింటుంది. మురళి లేచి చూస్తాడు. నాకు ఆకలిగా ఉంది బావ అని నందు అనగానే తిను నందు నీ కోసమే గా తెచ్చింది అని మురళి అంటాడు. అంటే ఇందులో ఏమైనా కలిపావా అని నందు అనగానే కొంచెం మురళి తిని తనకి ఇస్తాడు. డౌట్ క్లియర్ ఆ అని మురళి అంటాడు. హా అని నందు అంటుంది.
ఆ తర్వాత బావ నీకు నేలపై పడుకోవడం అలవాటేనా అని నందు అడుగుతుంది. లేదు నందు ప్రొద్దున లేచేసరికి అన్నీ నొప్పులు అంటే ముసలిది వేరే అర్ధం చేసుకుంటుందని మురళి అనగానే అయితే బావ నువ్వు కూడా బెడ్ పై పడుకో నీకొక సగం నాకొక సగం అని ఇద్దరి మధ్యలో పిల్లోస్ అడ్డుపెడుతుంది నందు.మరొకవైపు శంకర్ బ్యాగ్ లో ఉన్న అన్ని బుక్స్ జాను చదువుతుంది కానీ ఎందులో డబ్బు గురించి ఉండదు. మరొకవైపు సింహాద్రి డ్రింక్ చేస్తూ ఆ జానూకి నన్ను నిందించే సాక్ష్యం ఏదైనా దొరుకుతుందా అని టెన్షన్ పడుతాడు.మరుసటి రోజు పెద్దావిడ నందు వాళ్ళ గదిలోకి వచ్చి చెక్ చేస్తుంది. బెడ్ పక్కన స్వీట్.. బెడ్ పై మల్లెపూలు చూసి వీళ్ళ మధ్యన ఏదో జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విషయం వెళ్లి నందుని అడుగుతుంది. అదంతా ఏం లేదని నందు చెప్తుంది.
ఆ తర్వాత మురళి దగ్గరికి నందు వెళ్లి.. ఏంటి ఇదంతా ఆ మల్లెపూలు నువ్వే సెట్ చేసావా అని అడుగుతుంది. అవును వాళ్ళు అయినా హ్యాపీగా ఉండాలి కదా అని మురళి అంటాడు. అలా అయితే ఒకే కానీ నేను నిన్ను ఎప్పుడు భర్తగా ఒప్పుకోనని నందు చెప్తుంది. ఆ తర్వాత నందు, మురళి చేత పూజ జరిపించాలని పెద్దావిడ అందరిని గుడికి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు సూర్య తుఫాన్ కూడా అక్కడే ఉంటారు. తరువాయి భాగంలో శంకర్ డైరీలోని ఒక పేపర్ లో కుంకుమ ఉంటుంది. అది జానూ చూసి ఈ పేపర్ ఇక్కడికి ఎలా వచ్చిందని జాను అడుగుతుంది. అది నా బ్యాగ్ నుంచి నేను తీసానని కిన్నెర చెప్తుంది. ఆ డైరీ జాను చదువుతుంది. అందులో తోట గురించి ఎంత డబ్బు కట్టారనేది ఉంటుంది. అది చదివి సింహాద్రిని నిలదీస్తుంది జాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

