Home

»

Tv News

Godavari : బతుకమ్మ వేడుకలో  జానూని అవమానించి వెళ్లిపోయిన నందు!

Oct 28, 2026 11:59AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -149 లో....రాత్రి పూట జాను దెయ్యం ఉందో లేదో చూద్దామని స్థలానికి వెళ్తుంది. సంజయ్ జాను కోసం వెతికి అక్కడికే వెళ్తాడు. జాను సంజయ్ ని చూసి ఆత్మ అనుకుని.. రా ఆత్మగారు, మీకోసం వెయిట్ చేస్తున్నా, ఈ స్థలం నేను అమ్మాలి, మీరు వెళ్లిపోండి అని బతిమాలుతుంది. ఏయ్ నేను దెయ్యాన్ని కాదు, ఇక్కడేం చేస్తున్నావ్, నీకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని సంజయ్ కోప్పడి జానుని ఇంటికి తీసుకెళ్తాడు. పారు, జాను, రమణి బతుకమ్మ రెడీ చేసి బయటకు తీసుకొచ్చి పెడతారు. నందు వాళ్లంతా దూరం నుంచి చూస్తారు. జాను దండం పెట్టుకుంటే.. ఏంటి అంత సేపు మొక్కావని సంజయ్ అంటే .. అందరూ బాగుండాలని కోరుకున్నానని జాను అంటుంది. అందులో నేను ఉన్నానా అని సంజయ్ అడుగుతాడు. వీధిలో అందరూ వచ్చి బతుకమ్మ ఆడతారు. నందు ..‌చూశావా అమ్మా, తను గొప్పింటి కోడలు అని తన స్థాయి, దర్పం చూపించుకోవాలని మన ముందే ఇలా చేస్తుందని అంటుంది.

పారు ఒకామెను నందు వాళ్ల దగ్గరకు పంపి ఒప్పించి తీసుకురమ్మని చెప్తుంది. నందు వాళ్లు బతుకమ్మలు పట్టుకుని జాను వాళ్ల దగ్గరకు రావడంతో జాను చాలా హ్యాపీ అవుతుంది. అందరు కలిసి బతుకమ్మ ఆడతారు, బామ్మ మగవాళ్లను కూడా తీసుకొస్తుంది.నిత్య బతుకమ్మ తీసుకుని రావడంతో జాను వాళ్లు షాక్ అవుతారు. జానుతో.. మా నాన్న వచ్చి చెప్పినా నీ మొగుడు కాపాడాడనుకున్నావా, ఫంక్షన్ కి మా బావ వచ్చాడు, నిన్ను వదల్లేకపోతున్నాడు, మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలి, నిన్ను మర్చిపోవాలి, ప్రతీసారి నీ మొగుడు నిన్ను కాపాడలేడు, నేను మా నాన్న అంత మంచిదాన్ని కాదు, మా బావ నిన్ను మర్చిపోవాలి, లేదంటే నీ పుట్టింటి వాళ్లతో పాటు అత్తింటి వాళ్లని కూడా చంపించేస్తానని బెదిరిస్తుంది. తర్వాత సంజయ్ తో.. జానుని బాగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోయి, శేషుని కలిసి.. థ్యాంక్స్, ఏం జరిగినా చెప్తూ ఉండండి అని డబ్బు పంపిస్తుంది 

అందరూ బతుకమ్మలను నిమజ్జనం చేసిన తర్వాత జాను అందరికి వాయినాలు ఇస్తుంది. నందుకి ఇస్తే..‌నాకు అవసరం లేదు, నీ చీరలు, నగలు, డాబు, దర్పం చూపిస్తున్నావా.. కనిపిస్తుంది నీ పొగరు అని అంటుంది. పెళ్లి తర్వాత నీ కాళ్లు కార్లెక్కాయ్, కళ్లు నెత్తికెక్కాయ్, అందర్నీ చూసుకుంటా, పోషిస్తా అన్నావ్, నీ దారి నువ్వు చూసుకున్నావ్, నాకేమో వద్దన్నా మురళీ బావని ఇచ్చి పెళ్లి చేసి నువ్వు మాత్రం రిచ్ పర్సన్ ని చేసుకున్నావ్, బామ్మ ఆరోగ్యం బాలేదు, మందులు కావాలా, చెల్లెళ్ల ఫీజు కావాలా, అమ్మని చూసుకోవాలా, మన తోట ఇల్లు పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకుని వెళ్లిపోయావ్, నగలు దిగేసుకుని ఫోజులు కొడుతూ దానం చేస్తున్నట్లు నాకు వాయినం ఇస్తావా, నిన్ను చూస్తేనే కంపరంగా ఉందని నందు నానా మాటలు అంటుంది. మనమంతా ఒకే ఫ్యామిలీ అని బామ్మ అన్నా నందు వినదు. సంజయ్ వచ్చి.. ఏం మాట్లాడుతున్నారు, నా భార్యని ఇంకొక్క మాట అంటే ఊరుకోను, వాయినం తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదని ఫైర్ అవుతాడు. నందు వాయినం తీసుకుని నేలకి విసిరికొట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com