.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 148లో సంజయ్, జాను మధ్య ల్యాండ్ డీల్ ట్విస్ట్ హైలైట్ అయింది. జాను ఇంటర్వ్యూకి వెళ్తే అడ్రస్ చూసి.. సంజయ్ రామ్ వాళ్ల ఇంటి అడ్రస్ ఒకటే ఉందని అంటే.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నామని జాను అంటుంది. ఇంటర్వ్యూ అయ్యాక సంజయ్ కి కాల్ వెళ్తుంది. సంజయ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి జానును కారు ఎక్కించి ఓ స్థలం దగ్గరకు తీసుకెళ్తాడు.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు.. కిడ్నాప్ చేస్తారా అని జాను అంటే సంజయ్ నవ్వి.. నిన్ను కిడ్నాప్ చేసి మీ ఇంటికి కోటి అడిగితే ఇస్తారా అని అంటాడు. ఈ ల్యాండ్ మాదే, అమ్మిపెట్టు 2% కమీషన్ ఇస్తానని సంజయ్ అంటాడు. నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి, చెల్లికి ఫీజు కట్టాలి.. అమ్మిపెడతానని జానూ అనుకొని ఓకే చెప్తుంది.
ఇంటికి వచ్చి.. శ్రీనివాసనగర్ లోని మన స్థలం అమ్ముతానని సంజయ్ చెప్పగానే రమణి, శేషు, పారు, శివుడు షాక్ అవుతారు. ఆ ల్యాండ్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది.. అక్కడ దెయ్యం ఉంది.. అందర్నీ బెదిరిస్తుందని శివుడు చెప్తాడు. చాలా కథలు విన్నాం, పోతే పోనీ అని వదిలేశామంటే అంతా నేను చూసుకుంటానని జాను ధైర్యంగా అంటుంది.
రాత్రి సంజయ్ పడుకుంటే జాను లేపి.. అక్కడ దెయ్యాలు ఆత్మలు తిరుగుతున్నాయా, కొంచెం చెప్పండి ఆత్మ ధైర్యం ఇస్తే చిటికెలో అమ్మేస్తానని అడుగుతుంది. సంజయ్ చెప్పకుండా పడుకుంటాడు. శేషు.. జానుకి ఎందుకు స్థలం అమ్మమని చెప్పడం, ఇద్దరి మధ్య ఏదో లింక్ మిస్ అవుతుందని అనుమానిస్తాడు. నందు..అందరూ ఒకటయ్యారా, నేనే వేరయ్యానా అని బాధపడుతుంది. సంజయ్ లేచి చూస్తే జాను ఇంట్లో ఉండదు. జాను రాత్రి వేళ టార్చ్ తీసుకుని ఆ స్థలానికి వెళ్లి..దెయ్యాలు ఉన్నాయా.. దెయ్యం గారు రండీ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
