.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -134 లో..... సూర్య జానూతో తాళి తీసేసి నాతో వచ్చేయ్ అని అంటాడు. తాళి విలువ నీకు తెలీదా దీని వెనక చాలా మంది ప్రాణాలు ఉన్నాయని జానూ అంటుంది. జానూ వెళ్లిపోతుంటే సూర్య చేయి పట్టుకొని నేను నిన్ను వదలను అంటాడు. గోదావరి సముద్రంలో కలిసి ఉనికి కోల్పోయింది.. నేను ఇప్పుడు సంజయ్ భార్యని అని జాను అంటుంది. అప్పుడే సింహాద్రి ఎంట్రీ ఇచ్చి ఇద్దరు ప్రేమికులు ఐస్ క్రీం తినాలి కదా అంటాడు. నీ పాపాలకు శిక్ష పడే రోజు వస్తుందని సింహాద్రిని జానూ హెచ్చరిస్తుంది. మీ మాటలు మొత్తం వీడియో తీశా మీ మొగుడికి చూపిస్తానని సింహాద్రి బ్లాక్ మెయిల్ చేస్తాడు.
మరోవైపు నందు ఇంటర్వ్యూ దగ్గర పెళ్లైన అమ్మాయిలకు జాబ్ ఇవ్వరని తెలుసుకుంటుంది. ఓ అమ్మాయి పెళ్లైన వాళ్లకు జాబ్ ఇవ్వరా అని గొడవ చేయడం వింటుంది. నాకు పెళ్లైంది నాకు ఈ జాబ్ రాదని నందు బాధపడుతుంది. మరో అమ్మాయి సంతోషంగా వచ్చి అమెరికా ఆఫర్ వచ్చిందని చెప్తుంది. పెళ్లి కాలేదు కాబట్టి 6 నెలల్లో అమెరికా పంపిస్తారని ఆ అమ్మాయి చెప్తుంది. పెళ్లి కాకపోతే అమెరికా వెళ్లొచ్చు కానీ నాకు బలవంతంగా పెళ్లి చేశారని నందు బాధపడుతుంది. సంజయ్ ఆఫీస్ లో జాను గురించి ఆలోచిస్తూ పర్మినెంట్ గా ఉండిపోవాలని అనుకుంటుందా అని అనుకుంటాడు.
జానూ ఇంట్లో బామ్మ కాలు పడుతుంటే శివుడు చూసి నా భార్యకు నేను సేవ చేయాలి నువ్వేంటి అని జానూని అడుగుతాడు. జానూకి సంజయ్ కాల్ చేసి త్వరగా ఆఫీస్ కి రా అని అంటాడు. జానూ కావాలనే బామ్మ, శివుడు ముందు స్పీకర్ పెట్టి సంజయ్ తో ఆడుకుంటుంది. ఆ తర్వాత జానూ ఆఫీస్ కి వెళ్తుంది. ఆఫీస్ లో సెక్యూరిటీ అపాయింట్ మెంట్ ఉందా అని ఆపితే తాళి చూపిస్తుంది. నేనే మీ బాస్ భార్యని అని చెప్తుంది. స్టాఫ్ మొత్తానికి తను సంజయ్ భార్యనని పరిచయం చేసుకుంటుంది. అందరు మా సర్ కి పెళ్లి అయిపోయిందా అని షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
