Home

»

Tv News

Godhavari serial : అందరి ముందు సంజుకి ప్రపోజ్ చేసిన జాను.. నందు యాభై వేలు కడుతుందా!

Oct 13, 2026 11:13AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -136 లో......నందు తనకి జాబ్ వచ్చిందని ఇంట్లో అందరికి చెప్పి సంతోషపడుతుంది. ఆ తర్వాత తండ్రి ఫోటో దగ్గరకు వచ్చి నాకు జాబ్ వచ్చింది నాన్న ఇక నా కలను నేనే నెరవేర్చుకుంటానని అంటుంది. ఇంతలో బామ్మ వచ్చి తాళి బొట్టు ఎందుకు తీశావ్.. ఎందుకు మళ్లీ వేసుకున్నావ్.. నేను చూశానని నందుని నిలదీస్తుంది. నందు అలా చేయదని మురళి అంటాడు. నందు చాలా కంగారుపడుతుంది. ఏదో జరుగుతుంది నందు ఏదో చేస్తుందని బామ్మ గొడవ పడుతుంది. జాను ఇంట్లో అందరి కోసం స్నాక్స్ చేసి తీసుకొస్తుంది. అందరికి ఇస్తుంది. నాకు ఇవ్వలేదని సంజయ్ బాబాయ్ అంటే మామయ్యగారు మీ కోటా కిచెన్ లోనే తినేశారు కదా అని జాను అంటుంది. బామ్మ, తాతయ్య సంతోషంగా తింటారు. బామ్మ జాను వాళ్లకి మీ లవ్ ప్రపోజల్ మాకు కళ్లకు కట్టినట్లు చెప్పండని అంటారు. నేనేం చెప్పనని సంజయ్ చిరాకుగా వెళ్లిపోతే నేను ఒప్పించి తీసుకొస్తానని జాను వెళ్తుంది. ఇంతలో నందుకి మేనేజర్ కాల్ చేసి జాబ్ కి 50 వేలు ముందు కట్టాలని చెప్తాడు. నందు షాక్ అయిపోయి 50 వేలు కోసం ఏం చేయాలని టెన్షన్ పడుతుంది. జాను, సంజు ఇద్దరు రెడీ అవుతారు. ముందు జానునే సంజుకి ప్రపోజ్ చేసినట్లు చేస్తుంది. మీ ఇల్లు అద్దెకి ఇచ్చి సాయం చేశారు అలాగే మీ మనసు కూడా నాకు ఇస్తారా అని జాను అంటుంది. మిమ్మల్ని మొదటిసారి చూడగానే నాకు ఏదేదో అయిపోయిందని జాను అంటే డాక్టర్ కి చూపించుకోమని సంజయ్ అంటాడు. ఇది లవ్ డాక్టర్ కి చూపించుకోవాలని జాను మోకాలు మీద కూర్చొని గులాబీల బొకే ఇచ్చి ఐలవ్యూ చెప్తుంది. వెంటనే జానుకి సూర్య ప్రపోజల్ గుర్తొచ్చి డల్ అయిపోతుంది. సంజు గులాబీలు తీసుకోకుండా వెళ్లిపోతాడు. సీన్ రీ క్రియేట్ చేశావు కదా అందుకే కోపంగా వెళ్లిపోయాడని పెద్దాయన అంటారు. చివర్లో గౌతమి బాధగా ఉండటం.. బామ్మ మురళీతో ఈ సిటీ వదిలేసి వెళ్లిపోదాంరా అని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com