Home

»

Tv News

Godhavari :విడాకుల కోసం పట్టుబట్టిన సంజయ్.. తాళి తీసేసిన నందు!

Oct 11, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -135 లో.... నందు ఇంటర్వ్యూలో పెళ్లైన వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం లేదని తెలుసుకొని నా కోసం నా కుటుంబం కోసం ఈ తాళిని తీసేయక తప్పదని అనుకుంటుంది. మరోవైపు జానూ అందరితో మాట్లాడటం చూసిన సంజయ్ రిసెప్షనిస్ట్ కి కాల్ చేసి వెంటనే పంపించమని అంటాడు. జానూ సంజయ్ దగ్గరకు వెళ్లి ఏంటండీ అంటే అందరికీ పెళ్లయిందని చెప్పేశావా, ఆ మీటింగ్ ఏంటని అడుగుతాడు. మీరే తాళి కట్టారు కదా అందుకే చెప్పానని బాక్స్ తీసుకొచ్చా తిందామా అని జానూ అంటే నేను కొసరి కొసరి తినమని పిలవలేదు సీరియస్ గా మాట్లాడాలని పిలిచానని సంజయ్ అంటాడు. చాలా ఎక్కువ చేస్తున్నావ్ తగ్గమని సంజయ్ అంటే ఇప్పటికే చాలా తగ్గానని జానూ అంటుంది. అయినా ఈ టెంపరరీ పెళ్లి ఎందుకు పర్మినెంట్ గా చేసుకోవచ్చు కదా అని జానూ అడుగుతుంది. మా అమ్మమ్మ తాతయ్య కోసమే పెళ్లి చేసుకున్నా, ఒప్పందం ప్రకారం విడాకులు ఇస్తే పాపం భార్య వెళ్లిపోయిందంటారు. మళ్లీ పెళ్లి చేసుకోమని అనరని సంజయ్ అంటాడు. నేను విడాకులు ఇవ్వకపోతే అని జానూ అంటే ఇవే వద్దని సంజయ్ అంటాడు. ఒప్పందం అవ్వగానే నీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకో అని చెప్పి నాకు విడాకులు ఇవ్వమని సంజయ్ అంటే ఛీ అలా చేయనని జానూ అంటుంది. వాడు నీ కోసం బకెట్లు బకెట్లు ఏడ్చాడు కదా అని సంజయ్ అంటే వాడు వీడు వద్దు మర్యాద ఇవ్వండని జానూ కోప్పడుతుంది.

డబ్బు కోసం తాళి కట్టించుకోవడం సంస్కారమా అని సంజయ్ అంటే మీ స్వార్థం కోసం నేను బ్యాడ్ అవ్వాలా అని జానూ గట్టిగా చెప్తుంది. గడువు ముగిసే వరకే నాకు ఈ భార్య పాత్ర, ఆ తర్వాత మీరు ఏ కారణం చెప్పుకున్నా మీ ఇష్టం కానీ పెళ్లయ్యాక లవర్ వచ్చాడని వెళ్లిపోతే ఇంకో పేరుతో పిలుస్తారని జాను అంటుంది. నేను చెప్పినట్లు విడాకులు ఇవ్వవా అని సంజయ్ అడిగితే ఇవ్వను గడువు ముగియగానే వెళ్లిపోతానని జానూ అంటుంది. మరోవైపు నందు తాళి తీసేసి ఇంటర్వ్యూకి వెళ్తుంది. పెళ్లైందా అని అడగ్గా లేదని చెప్తుంది. సెలెక్ట్ అయి అమెరికా ఛాన్స్ ఉందని తెలిసి హ్యాపీగా బయటకు వచ్చి మురళీని చూసి కొంగు కప్పుకుంటుంది. జానూ ఇంటికి వెళ్తుంటే సంజయ్ డ్రాప్ చేస్తానని ఐస్ క్రీం పార్లర్ కి తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Godavari Today Episode October 10th, Godavari Serial Star Maa, Janu Sanjay Divorce Episode, Nandu Job Episode]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com