Home

»

Tv News

Godhavari : జాను సంచలన ఎంట్రీ.. మురళి విడుదల, గౌతమి పెను విషాదం!

Aug 13, 2026 9:13AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  గోదావరి (Godhavari).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్  81 లో... నందు తనని భర్త అని ఒప్పుకుందని మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మురళిని విడుదల చేయాలని తుఫాన్, బాబిన్ ఇద్దరు కలిసి కొంతమంది ఆడవాళ్లని తీసుకొని వచ్చి స్టేషన్ ముందు ధర్నా చేస్తారు. దాంతో ఇన్‌స్పెక్టర్ వాళ్ళ ఇద్దరిని పిలిచి లాటీలతో కొడుతాడు. మరొకవైపు గౌతమి జరిగింది గుర్తుచేసుకొని ఏడుస్తుంది.

 

అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి కాలేజీలో నీ గురించి కళ్యాణ్ తప్పుగా చేప్తున్నాడని మీరు చాలా క్లోజ్ అని ఏవేవో చెప్తున్నాడని తను చెప్పగానే గౌతమి ఏడుస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడుతారని కత్తితో తన చెయ్ కట్ చేసుకుంటుంది గౌతమి. అప్పుడే జాను వస్తుంది. గౌతమిని ఆపి కట్టు కడుతుంది. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావంటూ కోప్పడుతుంది. నా గురించి కాలేజీలో తప్పుగా చెప్తున్నారు అంట అని జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడే గౌతమి భుజంపై ఉన్న గాయం చూసి ఏమైందని అడుగుతుంది. దాంతో కళ్యాణ్ బలవంతం చెయ్యబోయాడు.. నేను తప్పించుకొని లోపలున్నానని జరిగింది చెప్తుంది. దాంతో జాను ఏడుస్తుంది. శారద బాధపడుతుంది ఇన్‌స్పెక్టర్ అన్న మాటలు జానూకి గుర్తువచ్చి తన గాయాలు అన్ని ఫోటో తీసుకుంటుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి లాయర్ ని తీసుకొని నందు, సూర్య వెళ్తారు బెయిల్ తీసుకొని వచ్చాము విడుదల చెయ్యండి అంటారు.

 

మురళి సెల్లో నుంచి బయటకు వస్తాడు. తనకి నడవడానికి రాకుంటే నందు తన భుజం పై చెయ్ వేసుకొని తీసుకొని వస్తుంది. మురళిపై పెద్ద కేసు అయింది ఒక మైనర్ అబ్బాయిని కొట్టినందుకు అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. అప్పుడే గౌతమిని తీసుకొని జాను వస్తుంది. మైనర్ అమ్మాయిని బలవంతం చెయ్యబోతే ఎంత పెద్దకేసు అవుతుందని జాను అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com