
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -126 లో....జానూ భోజనానికి కూర్చోగానే సంజయ్ లేచి పారు పక్కకి వెళ్లిపోతాడు. దీంతో జాను బాధపడితే.. వాడికి చిన్నప్పటి నుంచి నాతో కలిసి తినడం అలవాటు.. ఏం అనుకోవద్దని పారు సర్ది చెబుతుంది. జాను చీర మార్చుకోలేదేంటని రమణి అడిగితే బట్టలు లేవని చెప్తుంది. సంజు తీసుకెళ్లి షాపింగ్ చేయించాలి కదా అని అందరూ అనడంతో పారు.. మా అమ్మాయి చీరలు తీసుకోమని ఇస్తుంది.
డైనింగ్ టేబుల్ దగ్గర సంజు, జాను లవ్ స్టోరీ టాపిక్ వస్తుంది. పారు మనవడితో.. మీ ఇద్దరూ ఎలా కలిశారు, పెళ్లి వరకు ఎలా వచ్చారని అడగడంతో సంజు కంగారుపడతాడు. చెప్పలేక మౌనంగా ఉండగా జాను కవర్ చేస్తుంది. మీ మనవడు మొదటి చూపులోనే నాకు బాగా నచ్చేశాడు.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మొదట చూడగానే నచ్చారు.. తనకి నేను నచ్చా.. ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని పెళ్లి చేసుకున్నామని అబద్ధం చెప్పడంతో సంజుకి పొలమారతుంది. బామ్మ తాతయ్య మాత్రం సంతోషపడతారు.
రాత్రి జాను ఒంటరిగా బయట కూర్చుంటే సంజయ్ వచ్చి.. ఏంటి ఇక్కడ కూర్చున్నావని అడుగుతాడు. ఇక్కడ కూర్చోరాదని స్కెచ్ తీసుకుని రాయండి.. ఎక్కడ కూర్చోవాలో అగ్రిమెంట్ లో లేదు కదా అంటూ జాను కౌంటర్ ఇస్తుంది. ఇందాక తాతయ్య వాళ్లతో అన్నీ అబద్ధాలు అవసరమా అని సంజు అంటే బామ్మ తాతయ్య ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా అంటుంది. నాకు అబద్ధాలు నచ్చవని సంజు అంటే అయితే బామ్మ తాతయ్య రండి, మా అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్తానని జాను అనడంతో సంజు ఆపుతాడు. ఇక ముందు లవ్ కథలు చెప్పకని సంజు వార్నింగ్ ఇస్తే.. డబ్బు సాయం చేసిన పురుషోత్తముడు అని చెప్తానని జాను అంటుంది.
మరోవైపు ఇంట్లో వినాయకుడి ఆగమనం జరుగుతుంది. శివుడు, పార్వతి, కూతురు అల్లుడు అందరూ డప్పుచప్పుళ్లతో గణేషుడిని ఇంటికి తీసుకొస్తారు. జాను, సంజయ్ లను కూడా లాగి డ్యాన్స్ చేయిస్తారు. సంజు జాను పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అందరు కోరుకుంటారు. ఇంకోవైపు మురళి కూడా వినాయకుడి విగ్రహం, పూజ సామాగ్రి తీసుకొస్తాడు. ఇంట్లో అందరూ డల్ గా ఉండటం చూసి.. జాను ఏదో చేసిందని మనం బాధపడుతూ ఉండటమేంటి.. ఈరోజు వినాయక చవితి, పండగ చేసుకుందామని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
