Home

»

Tv News

 ఇంటి కోడలిగా జాను హడావుడి.. ఫ్యామిలీ కోసం నందు జాబ్ చేయడానికి సిద్ధం!

Oct 8, 2026 10:55AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -132 లో...జాను ఉదయమే పూజలు చేసి అందరికి విష్ చేస్తుంది. జాను నీకు అందరు ఫిదా అయిపోయారని రమణి భర్త చెప్తాడు. ఇక జాను ఇంట్లో అందరికి కాఫీ తీసుకొస్తానని అంటుంది. రమణి సాయం చేయడానికి వెళ్తే నేనే పెడతా అంటుంది. నీకు తెలీదు కదా అంటే లేదు అత్తయ్య తెలుసు.. తాతయ్య గారికి నో షుగర్, నానమ్మకి ఒక స్పూన్, మీకు మామయ్య గారికి రెండు స్పూన్లు అని చెప్తుంది. మరి సంజయ్ కి తెలుసా అంటే తెలీదన్నట్లు ముఖం పెడుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంజయ్ ఏ కాఫీ తాగుతాడో తెలీదా అంటే నేను ఎప్పుడూ ఐస్ క్రీం తిన్నాను.. సంజు కొబ్బరి నీళ్లు తాగేవాడని కవర్ చేస్తుంది.

సంజయ్ కి పంచదార లేకుండా కాఫీ తాగే అలవాటు ఉందని రమణి చెప్తుంది. జాను అందరికి కాఫీ చేసి ఇస్తుంది. ఈ రోజు నుంచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ నావే, ఇంటి కోడలు వచ్చింది.. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని జాను అంటుంది. తర్వాత సంజయ్ గదికి జాను వెళ్లి నిద్ర లేపి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ ఇస్తుంది. నువ్వేంటి నా గదిలో.. వెళ్లిపోమని సంజయ్ గోల చేస్తాడు. పొద్దున్నే లేచి రెడీ అయి టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్లాలని జాను అంటుంది. ఇవన్నీ చెప్పడానికి నువ్వు ఎవరంటే నేను లైసెన్స్ ఉన్న భార్యని అని అంటే అది టెంపరరీనే అని సంజయ్ అంటాడు. సంజయ్ కాఫీ వద్దు అన్నా జాను ఇస్తుంది. ఇక చిరాకుతో నెత్తి మీద పెట్టమని సంజయ్ అనడంతో జాను నిజంగానే సంజయ్ నెత్తి మీద కాఫీ పెట్టేస్తుంది.

కాఫీ మీద నుండి తీయ్ అని సంజయ్ అంటే కాఫీ తీయాలంటే నాకు కొన్ని కండీషన్లు ఉన్నాయని జాను చెప్తుంది. నన్ను నా వ్యక్తిత్వాన్ని గౌరవించాలి.. మా ఫ్యామిలీని గౌరవించాలని చెప్తుంది. సంజయ్ సరే అంటాడు. జాను మాత్రం మాట్లాడుతూనే ఉంటుంది. జాను నువ్వు మంచిదానివి అంటే తీస్తానని సంజయ్ తో చెప్పించుకొని కాఫీ తీస్తుంది. మరోవైపు నందు ఇంటి కోసం జాబ్ చేయాలని అనుకుంటుంది. ఇంటర్వ్యూకి బయల్దేరుతుంటే అందరు ఆపుతారు. ఇల్లు గడవొద్దా, ఇంటి బాధ్యతలు తీసుకుంటానని చెప్పిన జాను వెళ్లిపోయింది.. బావ సంపాదన సరిపోదు కదా అని జాబ్ కోసం వెళ్తున్నానని చెప్తుంది. మురళీనే నందుని ఇంటర్వ్యూకి తీసుకెళ్తాడు. చిన్నక్క డబ్బున్న వాడిని చూసుకొని వెళ్లిపోయింది.. పెద్దక్క జాబ్ చూసుకుంది. నా గురించి ఎవరూ ఆలోచించరని గౌతమి అనుకుంటుంది.

చివరగా జాను అందరికి టిఫిన్ పెడుతుంది. సంజయ్ రావడం చూసి పిలుస్తుంది. సంజయ్ రానని ఆఫీస్ కి వెళ్తుంటే ఆపి నుదిటిన బొట్టు పెడుతుంది. ఏవండీ ఏవండీ అంటూ సంజయ్ కి లంచ్ బాక్స్ అందిస్తుంది. బామ్మ వాళ్లు చూసి మురిసిపోతారు. ఏంటి ఈ ఓవర్ అని సంజయ్ అంటే మీరే కదా అందరి ముందు భార్యలా నటించమన్నారు.. నా నటన నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అని జాను అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com