స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -127 లో.....శివుడు, పారు అంగరంగ వైభవంగా ఇంట్లో గణేషుడిని ఏర్పాటు చేసి సంజయ్, జాహ్నవిల చేతుల మీదుగా పూజ చేయిస్తారు. జాను, సంజు ఒకరికి ఒకరు కుంకుమ బొట్టు పెట్టుకుని కంకణాలు కట్టుకుని పూజ చేస్తారు. సంజు గతం, జ్ఞాపకాలు తొలగిపోయి ఇద్దరూ సంతోషంగా ఉండాలని పారు కోరుకుంటుంది. మరోవైపు మురళీ, నందు పూజ చేస్తే గౌతమి పూజ చదువుతుంది. పూజ అయిన తర్వాత అందరు ప్రదక్షిణలు చేస్తారు. జాను పడిపోబోతే సంజయ్ పట్టుకోవడంతో అందరు మురిసిపోతారు. పంతులు వెళ్తూ.. మీ ఇంట్లో బుల్లి మనవడో మనవరాలో తిరగాలని దీవిస్తాడు. పంతులుగారు చెప్పింది విన్నారు కదా, మీరు ఇద్దరూ అది నెరవేర్చాలంటూ జాను, సంజులను సిగ్గుపడేలా చేస్తుంది పార్వతి.
పూజ అయిపోయిన తర్వాత జాను తన పుట్టింటికి వెళ్తుంది. గుమ్మం దగ్గరే నిలబడిన జానుని చూసి శారద కోపంగా చూస్తుంది. మురళీతో.. ఓ శని మన ఇంటి ముందు నిల్చుంది, వెళ్లి పంపించేయ్ అంటుంది. అమ్మా.. అని జాను పిలిస్తే నాకు ముగ్గురే కూతుళ్లు, ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పమంటూ శారద తెగేసి చెప్తుంది. అమ్మా నేను తప్పు చేశా.. నన్ను క్షమించమ జాను బ్రతిమాలినా శారద కరగదు. దానికి మాట్లాడకుండా మెడ పట్టుకుని గెంటేస్తావా..నన్ను గెంటేయమంటావా అని మురళీపై శారద అరుస్తుంది. అది చచ్చిందని నీళ్ళు పోసుకున్నా, దెయ్యాలు భూతాలు మా ఇంటికి వస్తే ఊరుకోనని శారద తెగేసి చెప్తుంది. బామ్మతో చెప్పించాలని జాను ప్రయత్నించినా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని శారద అరుస్తుంది. అమ్మా నీ కాళ్లు పట్టుకుంటా, ఒక్కసారి లోపలికి రానివ్వమని జాను ఏడుస్తుంది. ఒక్క అడుగు ముందుకు వేసినా నేను చచ్చినంత ఒట్టే అని శారద శపథం చేయడంతో జాను ఏడుస్తూ వెళ్లిపోతుంది.
బయట జాను కోసం వెయిట్ చేస్తున్న పారు, శివుడికి జరిగింది చెప్తుంది. జాను వాళ్ల పుట్టింటికి వెళ్లింది, వాళ్లు రానివ్వలేదు పాపమని బాధపడుతుంది. ఏడుస్తూ వచ్చిన జానుని చూసి పారు, శివుడు ధైర్యం చెప్తారు. పిల్లల పెళ్లిళ్ల మీద తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటారు, అందుకే కోపంగా ఉంటారు. కాస్త ఓపిక పడితే వాళ్లే సెట్ అవుతారని చెబుతారు. వచ్చే వినాయక చవితికల్లా వాళ్ల చేతిలో బుల్లి మనవడినో మనవరాలినో పెట్టావంటే వాళ్లే మీకు దగ్గరైపోతారు. చిన్న పిల్లల్ని చూస్తే ఎవరైనా కరిగిపోతారని పారు సలహా ఇస్తుంది. దీంతో జాను మనసులో..ఇది అగ్రిమెంట్ పెళ్లి, మనవడినో మనవరాలినో ఇవ్వడానికి కుదరదని అనుకుంటుంది.
రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియక జాను ఆరుబయట కూర్చుని ఉంటుంది. అది చూసిన సంజయ్ వాళ్ళ పిన్ని రమణి.. ఏమైందని అడుగుతుంది. ఎక్కడ పడుకోవాలో తెలియదని ఇక్కడ కూర్చున్నానని జాను అంటే ఇంకెక్కడ పడుకుంటావ్ జాను.. సంజయ్ గదిలోనే అని చెప్పి సంజయ్ గది దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తుంది. సంజు డోర్ తీసి చూసి.. ఏమైంది, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని అంటాడు. నేను ఎక్కడ పడుకోవాలని జాను అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godavari Serial Today October 1st Episode, Godavari Serial Sanjay Janu Pooja, Janu Mother Sharada Rejects, Ramani Sends Janu To Sanju Room]




