Home

»

Tv News

Godhavari : మురళికి నందు‌ దగ్గరవుతుందా..‌జాను రిసెప్షన్‌కి అందరు వస్తారా!

Oct 20, 2026 12:34PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -142 లో..... జాను రిసెప్షన్ కి వెళ్లాలని మురళీ, బామ్మ వాళ్లు ప్లాన్ చేస్తారు. జాను కిన్నెరతో మాట్లాడుతుండగా సంజయ్ రావడంతో బావగారు అని కిన్నెర అంటుంది. బావ మంచోడేనా అని కిన్నెర అడగ్గా చాలా మంచోడు కానీ బిజినెస్ టెన్షన్ లో ఉన్నారని జాను కవర్ చేస్తుంది. మరోవైపు మురళీ నందు కోసం 6 వేలు అప్పు చేసి డ్రెస్సులు కొని కుడతాడు. ఇవన్నీ ఇప్పుడెందుకని నందు అడిగినా అవసరం లేదని మురళీ అంటాడు. డ్రెస్సులు బాగున్నాయని నందు చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో మురళీ గాల్లో తేలిపోతాడు.

అదే సమయంలో బామ్మ జాను దగ్గరకు వచ్చి ఏడుస్తూ తన సొంత గాజులు జానుకి వేస్తుంది. ఇవి నా సొంతం అమ్మా, నీకు ఇవ్వడానికి మనసునిండా ప్రేమ తప్ప నా దగ్గర ఇంకేం లేదమ్మా అని ఏడుస్తుంది. నీ పెళ్లికి నా కానుక అనుకో అమ్మా అని బామ్మ చెప్పడంతో జాను ఎమోషనల్ అవుతుంది. అబ్బాయి వచ్చాడు, రమ్మని పిలిచాడు. చాలా మర్యాదగా మాట్లాడాడని, అసలు మీరు ఇద్దరూ ఎప్పుడు ప్రేమించుకున్నారమ్మా అని జానుని బామ్మ అడుగుతుంది. రిసెప్షన్ కి వస్తారు కదా అని జాను అడగ్గా, మీ అమ్మ, నందు కోపంగా ఉన్నారని, ప్రయత్నిస్తానని బామ్మ చెప్పి వెళ్లిపోతుంది.

ఇంట్లో అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్లాలని రెడీ అవుతుంటే జాను మేడ మీద నుంచి పుట్టింటిని చూసి కుమిలిపోతూ ఉంటుంది. నందు ఆఫీస్ కి వెళ్లలేదని అందరూ గమనిస్తారు. నేను అలా వెళ్లగానే మీరు జాను ఫంక్షన్ కి వెళ్లాలి అనుకున్నారా అని నందు నిలదీస్తుంది. మేం ఏం వెళ్లమని బామ్మ కవర్ చేసినా నందుకి అనుమానం వస్తుంది. శారద మురళీకి నందుని ఆఫీస్ కి తీసుకెళ్లమని చెప్పడంతో బావ నీకు కడుపు నొప్పి అన్నావ్ అని కిన్నెర అనడంతో ప్లాన్ బయటపడేలా అవుతుంది. బామ్మ, గౌతమి, కిన్నెర, మురళీ ఫంక్షన్ కి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తుండగానే జాను వాళ్లు రిసెప్షన్ హాల్ కి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Godavari Serial Today October 19th Episode, Godavari Serial Star Maa, Janu Reception Plan Murali Bamma, Nandu Doubt Function Twist]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com