.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-146లో..సింహాద్రి అందరి ముందు జాను-సూర్యల ప్రేమ విషయం బయటపెడతాడు. ఆ తర్వాత సింహాద్రిని సంజయ్ కొట్టి.. ఆ విషయం నాకు ముందే తెలుసని అంటాడు. నోరుమూయ్, ఇంకో మాట మాట్లాడితే నాలుక చీరేస్తానని శివుడు రెచ్చిపోతాడు. శారద సింహాద్రి కాలర్ పట్టుకుని.. చెల్లెమ్మా అంటూనే మా ఆయన ప్రాణాలు తీశావ్.. ఆస్తి లాక్కున్నావ్.. ఇప్పుడు నా బిడ్డ బతుకులో నిప్పులు పోయాలని చూస్తున్నావా అని లాగిపెట్టి కొట్టి.. నా అల్లుడు దేవుడురా, నీ మాటలు తప్పుగా అర్థం చేసుకోలేదని గెంటేస్తుంది.
ఆ తర్వాత శారద మనసు మారుతుంది. సంజయ్ తో.. అల్లుడుగారు నన్ను క్షమించండి, దేవుడు మాకు బంగారం లాంటి అల్లుడిని ఇచ్చాడు.. నా కళ్ల ముందు పెళ్లి జరగలేదనే బాధ తప్ప కోపం లేదని జానును పట్టుకుని ఏడుస్తుంది. జాను చేయి సంజయ్ చేతిలో పెట్టి.. చల్లగా ఉండండి అని దీవిస్తుంది. బామ్మ కూడా ఆశీర్వదిస్తుంది. శివుడు.. నీ భార్య గౌరవాన్ని, మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు.. భర్త అంటే నీలా ఉండాలని సంజయ్ ను మెచ్చుకుంటాడు.
మరోవైపు అవమానంతో సింహాద్రి, నిత్య రగిలిపోతారు. జాను చాప్టర్ ముగిసిపోతుంది అనుకుంటే సంజయ్ వెనకేసుకొచ్చాడని సింహాద్రి అంటే నిత్య.. పరువు పోకూడదని సంజయ్ అలా చెప్పాడు.. మళ్లీ ప్లాన్ చేయాలి.. ఈ సారి బావను వాడుకుని జాను జీవితం సర్వనాశనం చేయాలని ప్లాన్ వేస్తుంది. ఇంట్లో నందు శారద వాళ్లను నిలదీసి.. మీరంతా జాను ఫంక్షన్ కి వెళ్లారని తెలుసు, నా కూతురు చచ్చిపోయిందని నీళ్లు పోసుకుని ఇప్పుడు అక్షింతులు వేసి వచ్చావా అని అడుగుతుంది. చివర్లో శేషు శోభనం ఆగిపోవాలని కోరుకుంటుండగా.. పారు, రమణి జాను, సంజయ్ ల ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
