
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 125 లో.. జాను తన వాళ్లు ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే ఆపమని బతిమిలాడుతుంది. అసలు నువ్వు చేసింది కరెక్టేనా అమ్మా, ఇంట్లో చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. మాకు చెప్పినా ఏదో ఒకటి చేసి ఒప్పించే వాళ్లం కదా అని శివుడు జానుతో అంటాడు. దానికి జాను..ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకుంటుందండి.. ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుందాం అన్నాను కానీ మీ మనవడు ఒప్పుకోలేదని అంటుంది. మా మనవడి మొండితనం నాకు బాగా తెలుసు అంటూనే మీ పరిచయం ఎంతది, ఇలా పెళ్లి చేసుకోవడానికి మీ వాలకం చూస్తుంటే నువ్వు మాతో అబద్ధం చెప్తున్నావ్ అనిపిస్తుందని శివుడు అనుమానిస్తాడు. ఏ ఆడపిల్ల తన పెళ్లి దొంగతనంగా జరగాలని అనుకోదు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మా నాన్నకు మాట ఇచ్చా, నా మీద కోపంతో మా వాళ్లు వెళ్లిపోతారు.. ఉండమని చెప్పండి అని జాను బతిమాలుతుంది.
మరోవైపు శారదకు నందు కాఫీ ఇస్తే.. విషం కలిపిరా, తాగి చస్తా అని అరుస్తుంది. ఇంతలో శివుడు, పార్వతి ఇంటికి వస్తే చూసి శారద పరుగున వెళ్లి వాళ్ల మీద అరుస్తుంది. జరిగింది జరిగిపోయింది, మీరు ఇంటి నుంచి వెళ్లిపోతారని మీ కూతురు భయపడుతుంది.. ఏడుస్తుంది, అర్థం చేసుకోండి అని శివుడు, పార్వతి చెప్తారు. దీనికి శారద.. నాకు కూతురే లేదు, ఎప్పుడో చచ్చిపోయింది, అన్నీ మర్చిపోయి అల్లుడు కూతురికి పిలిచి బట్టలు పెట్టాలా.. అది నా కూతురు కాదు..మీ మనవడు నా అల్లుడు కాదు.. ఇక్కడి నుంచి వెళ్లండి అని అరుస్తుంది.
మేడ మీద నుంచి తాత, అమ్మమ్మ బతిమాలడం, శారద అరవడం చూసి సంజయ్ వెంటనే కిందకి వచ్చి ఫైర్ అవుతాడు. ఏంటి ఇది ఇక్కడేం జరుగుతుంది, ఎవరి ఇంటి నుంచి ఎవర్ని వెళ్లమంటున్నారు.. బాధలో ఉంటే మూలన కూర్చుని ఏడవాలి.. ఇలా మర్యాద లేకుండా అరుస్తారా.. మా అమ్మమ్మ తాతయ్యలతో అమర్యాదగా మాట్లాడటం ఏంటి, పెళ్లి జరిగింది ఇష్టం అయితే భరించండి, కష్టం అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి.. మా అమ్మమ్మ తాతయ్యల్ని ఒక్క మాట అంటే ఊరుకోనని సంజయ్ వార్నింగ్ ఇస్తాడు. నీ పెళ్లామే వెళ్లి మాట్లాడమని చెప్పిందని సంజయ్ తో శివుడు చెప్తాడు. సంజు ఒక్కడే తప్పు చేసినట్లు వాళ్లు మాట్లాడటం తప్పు అని పార్వతి అంటుంది.
సంజయ్ కోపంగా జాను దగ్గరకు వెళ్లి.. మా తాతయ్య అమ్మమ్మని ఎందుకు పంపావ్.. నువ్వు ఎలా పంపిస్తావ్.. మీ అమ్మ ఎలా మాట్లాడిందో తెలుసా అని గొడవ పడతాడు. కోపంలో మాట్లాడేసి ఉంటుందని జాను అంటుంది. మీ బాధలు నాకు అవసరం లేదు, ప్రాబ్లం నీది అయితే మా వాళ్లని ఎందుకు పంపావ్.. మా వాళ్లకి నువ్వు ఎలా పని చెప్తావని సంజయ్ అంటే మీకు పని చెప్తే వింటారా అని జాను అడుగుతుంది. పెళ్లి నేను బలవంతం చేసి చేసుకోలేదు,..నువ్వు నన్ను ఇష్టపడి చేసుకోలేదు.. డబ్బు కోసం చేసుకున్నావ్.. అగ్రిమెంట్ పెళ్లి అని గుర్తుంచుకో, సొంత పెళ్లాంలా ఫీల్ అవ్వకు.. జీవితాంతం ఉండిపోవు కదా అని సంజయ్ హర్ట్ చేస్తాడు. రాత్రి అందరు భోజనానికి కూర్చుంటే సంజయ్ పక్కనే జాను కూర్చుంటే సంజయ్ లేచి పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






