Home

»

Tv News

Godhavari :ఇల్లు వదిలి ఊరెళ్లిపోదామన్న శారద..తల్లిని ఆపమని వేడుకున్న జాను!

Sep 29, 2026 9:36AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి (Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  124 లో.....జాను పెళ్లి చేసుకుని రావడంతో శారద "నా కూతురు ఈ రోజుతో చచ్చిపోయింది" అంటూ నీళ్లు వదిలేసి గేటు వేసి ఇంట్లోకి వెళ్లిపోతుంది. జాను గేటు బయటే కుప్పకూలి ఏడుస్తుంది. మరోవైపు శివుడు సంజయ్ దగ్గరకు వెళ్లి ఫైర్ అవుతాడు. "పెళ్లి చేసుకుంటే సరిపోదురా, నమ్మకం ఉండాలి. పెళ్లి బట్టల్లో ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేసి వచ్చావ్" అని కోప్పడతాడు. దానికి సంజు "పెళ్లి మా ఇద్దరికి సంబంధించింది, మాకు ఇష్టం ఉంది చేసుకున్నాం" అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో శివుడికి మరింత కోపం వస్తుంది.

 

పార్వతి మాత్రం అర్థం చేసుకుని రమణిని పంపి జానును తీసుకురమ్మంటుంది. రమణి వెళ్లి జానును ఓదారుస్తూ "మీ అమ్మ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. కనీసం ఒక్క మాట చెప్పి ఉంటే మేమే ఒప్పించేవాళ్లం కదా. నీ మీద కోపం కంటే నీ చెల్లెళ్ల పెళ్లి గురించే మీ అమ్మకు బాధ ఎక్కువ ఉంది. రెండు రోజులు ఆగితే కోపం తగ్గుతుంది" అని ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొస్తుంది. ఇంట్లో సంజు ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ గా ఉండటం చూసి శివుడు, పార్వతి కోపంగా ఉంటారు. పార్వతి పెద్ద మనసుతో జానును ఇంటి మహాలక్ష్మిలా ఆహ్వానించాలని నిర్ణయిస్తుంది.

 

జానును గుమ్మం బయటే నిలబెట్టి హారతి ఇప్పిస్తుంది పార్వతి. సంజు మెడలో దండ వేసుకోమని, ఇద్దరినీ పేర్లు చెప్పుకోమంటుంది. సంజు మొదట చెప్పను అన్నా, తర్వాత జాహ్నవి అని, జాను సంజయ్ అని చెప్పుకుంటారు. ఇద్దరూ కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెడతారు. బామ్మ ఇద్దరిని దేవుడి దగ్గరకు తీసుకెళ్లి దండం పెట్టించి, జాను చేత దీపం పెట్టిస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి అంటూ ఆశీర్వదిస్తుంది. తర్వాత సంజయ్ ఆశీర్వాదం తీసుకోమని చెప్పి జానును లోపలికి తీసుకెళ్తుంది రమణి.

 

మరోవైపు శారద ఇంట్లో మాత్రం పెద్ద గొడవ జరుగుతోంది. అది ఇలా చేస్తుందనుకోలేదు, మనం మన ఊరు వెళ్లిపోదాం పదండి. ఆయన పోయాక ఇంటిని చూసుకుంటానని చెప్పాను, ఇప్పుడు దాని బతుకు అది చూసుకుందంటూ శారద ఏడుస్తూ ఇల్లు వదిలేసి వెళ్లిపోదామనుకుంటుంది. కిన్నెరకు ఇప్పుడే ఆపరేషన్ అయిందని, డాక్టర్ కు చూపించాలని కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వినదు. చివర్లో జాను శివుడు, పార్వతిల దగ్గరకు వెళ్లి.. పెళ్లి రెండు కుటుంబాలను కలపాలి కానీ నా పెళ్లి నన్ను నా కుటుంబానికి దూరం చేసింది. వాళ్లు ఇల్లు వదిలి వెళ్లిపోతారు, దయచేసి వెళ్లి వద్దని చెప్పండని ఏడుస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Godhavari, Godhavari Episode 124, Star Maa Serial, Janu, Sanjay, Sharada, Shivudu, Parvathi, Ramani, Kinnera]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com