స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -123 లో.....జాను, సంజయ్ లు దండలు మార్చుకుంటారు. అమ్మవారి సాక్షిగా పెళ్లి అవుతుందని పంతులు అనడంతో జాను సూర్యని తలచుకొని బాధ పడుతుంది. నువ్వు రాకపోయి ఉంటే నాలోని కొత్త సంజుని నువ్వు చూసేవాడివి అని సంజు అంటాడు. అవసరం తీరిపోతే పారిపోయే దాన్ని కాదని జాను అంటుంది. మంచి క్వాలిటీ అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ఇలాగే ఉండమని సంజయ్ అంటాడు. తర్వాత సంజు పంతులుతో.. నాకు అవతల చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, తాళి కట్టించండి అని అంటాడు. జాను బిత్తరపోయి చూస్తుంది.
సింహాద్రి మాట్లాడాల్సిన వ్యక్తి ఇంకా టైం పడుతుంది అనడంతో దేవుడికి దండం పెట్టుకొని వస్తానని గుడిలోకి వస్తాడు. అప్పుడే జాను, సంజయ్ పెళ్లి చేసుకుంటూ ఉండటం చూసి షాక్ అయిపోతాడు. దేవుడా వీళ్లిద్దరికీ ముడి వేశావా, నువ్వు ఉన్నావ్ అమ్మా, వీడేంటి కథలోకి వచ్చాడనుకున్నా వీడు హీరో అయ్యాడా.. ఇదేదో దొంగ పెళ్లిలా ఉందనుకుంటూ పెళ్లిని సింహాద్రి వీడియో తీస్తాడు. సంజయ్ జాను మెడలో తాళి కట్టేస్తాడు. జానుని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు.
నందు, మురళీ, శారద కిన్నెరను తీసుకొని ఇంటికి వస్తారు. బామ్మ కిన్నెరకు దిష్టి తీస్తుంది. జాను ఇంట్లో ఉందా అని నందు అడిగితే లేదని చెప్తారు. ఇంట్లో లేదు హాస్పిటల్ లో లేదు ఎక్కడికి వెళ్లిందనుకుంటారు. పారు, శివుడు కిన్నెర వాళ్లని చూసి పలకరించాలి వెళ్లే టైంకి సంజయ్ జానుని తీసుకొని వస్తాడు. సంజయ్ శివుడిని చూసి.. తాతయ్య ఎలా ఉన్నానని అడుగుతాడు. అందరూ జానుని చూసి బిత్తరపోతారు. బామ్మ కిన్నెరను లోపలికి తీసుకెళ్లమని నందు పంపేస్తుంది.
జాను దగ్గరకు శారద వెళ్లి.. ఓసేయ్ జాను ఏంటే ఇది ఏం చేశావే అని కొడుతుంది. పెళ్లి చేసుకున్నాం కనిపించలేదా అని సంజయ్ అంటే నువ్వు మాట్లాడకని శారద అంటుంది. నీ చెల్లికి ఆపరేషన్ అయి ఈ రోజే పంపారు నీకు తెలుస్తుందా.. నీకు అప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందా అని శారద కొడుతుంది. అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్దాం పదా అని బామ్మ అంటుంది.నేను చచ్చినా దీన్ని ఇంట్లోకి తీసుకెళ్లనని శారద అంటుంది. శారద ఏడుస్తూ.. నువ్వు నా కూతురు కాదు నేను నీ తల్లి కాదు, నువ్వు పుట్టలేదు అనుకుంటా.. నువ్వు చచ్చిపోయావ్ అనుకుంటానని జాను మీద మట్టి వేసి, బిందెతో నీళ్లు మీద వేసుకొని తల కడిగేసి.. నా రెండో కూతురు ఈ రోజుతో చచ్చిపోయిందని నీళ్లు వదిలేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godavari Serial Today Episode September 26, Janu Sanjay Marriage Godavari, Sharada Abandons Janu Godavari Serial]




