
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 122 లో...... సంజయ్ తో జాను మాట్లాడటం చూసి నందు, గౌతమి ప్రశ్నిస్తారు. నేను ఇక్కడ మిషన్ కుట్టడం వల్ల సంజయ్ గొడవపడి ఇల్లు ఖాళీ చేయమని అంటే జాను బతిమాలుతుందని మురళి కవర్ చేస్తాడు. మా దగ్గర ఏమైనా దాస్తున్నావా జాను, అతనితో మాటలేంటి.. జాను కిన్నెర రాగానే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. ఆ మనిషి నాకు నచ్చలేదని నందు అంటుంది.
బామ్మ, నందు, జాను, గౌతమి, మురళి ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటుండగా జాను డల్ గా ఉంటుంది. ఇంతలో జానుకి సంజయ్ ఫోన్ చేస్తాడు. కొత్త నెంబర్ అనుకొని జాను మాట్లాడితే ఎవరు అది అని నందు అడుగుతుంది. నెంబర్ సేవ్ చేసుకోవాలి కదా అని సంజయ్ అనడంతో జాను నా ఫ్రెండ్ సంజన అని చెప్పి పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. మన పెళ్లి గుర్తుంది కదా రేపు వస్తున్నావా.. రాత్రికి రాత్రే మాయం అవుతావేమో అని డౌట్ అని సంజయ్ అంటే నేను అలాంటి దాన్ని కాదని జాను అంటుంది. తర్వాత జాను దగ్గరకు నందు వచ్చి.. ఏమైంది? ఏమైనా తప్పు చేశావా.. నీకు తెలియకుండా ఏమైనా పొరపాటు జరిగిందా.. నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పమని నందు అడిగినా జాను ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది.
ఉదయం అందరు కిన్నెరను తీసుకురావడానికి రెడీ అవుతారు కానీ జాను ఇంట్లో ఉండదు. అక్క ముందే వెళ్లిపోయిందని గౌతమి చెప్తుంది. ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా జాను తల్లడిల్లిపోతుంది. నా కొడుకు తర్వాత తనే ఈ ఇంటికి కొడుకు లాంటిదని బామ్మ అంటుంది. మరోవైపు జాను గుడికి పెళ్లి కూతురిలా రెడీ అయి వెళ్లి ఓ మూలన కూర్చొని బాధపడుతుంది. పెళ్లి అంటే ఆడపిల్లకి చాలా గొప్ప ఆనందం.. సూర్యని నన్ను దూరం చేశావ్.. చెల్లి కోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకునేలా చేస్తున్నావ్.. ఇంట్లో వాళ్ల సమక్షంలో చేసుకుంటే బాగుండేది.. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి దేవుడా అంటూ జానూ కన్నీరు పెట్టుకుంటుంది.
ఇంతలో సంజయ్ ఫ్రెండ్స్ వచ్చి మీ ప్రేమ ఎలా మొదలైంది.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారని జానును ప్రశ్నిస్తారు. అదే టైమ్ లో జానుకి ఫోన్ చేస్తుంది నందు. జాను మాట్లాడే టైంకి సంజయ్ వచ్చి ముహూర్తానికి టైమ్ అయింది అంటూ జానుని తీసుకెళ్లిపోతాడు. సింహాద్రి కూడా పని మీద అదే గుడికి వస్తాడు. ఇక సంజయ్, జానులకు ఫ్రెండ్స్ నుదుటిన బాసికం కడతారు.. ఇద్దరూ దండలు మార్చుకుంటారు. ఆ సమయంలో జాను తండ్రిని, ఫ్యామిలీని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari, Godhavari Episode 122, Star Maa Serial, Janu, Sanjay, Nandu, Gowthami, Murali, Kinnera, Simhadri, Marriage Agreement, Wedding]






