Home

»

Tv News

సంజయ్ బెడ్ రూమ్ లో జాను... ఇంటికోడలుగా మారిందా!

Oct 7, 2026 10:39AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -131 లో.... నందు బయట ఆలోచిస్తుంటే జాను అక్కడికి వచ్చి ఒక్కసారి అమ్మని చూసి వెళ్తానని అడుగుతుంది. దీనికి నందు రగిలిపోతుంది. ఎందుకు జాను ఉన్న కాస్త ప్రాణం కూడా తీసేద్దామని అనుకుంటున్నావా అంటూ ఫైర్ అవుతుంది. ఇంటి పెద్ద కొడుకుని అన్నావ్.. అందరి బాధ్యత నీదే అన్నావ్.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడు ఉంటా అన్నావ్, నీ తోడు చూసుకొని నువ్వు వెళ్లిపోయావని జానూని నందు నిలదీస్తుంది. అందరి గుండెల్లో గునపాలు దింపావ్.. కళ్లలో ప్రేమ చూపించి ఇంత విషం పెట్టుకున్నావా.. నువ్వు చూస్తే ఉన్న ప్రాణం కూడా పోతుందని జానూని నందు గెంటేస్తుంది. మురళీ వచ్చి జానుతో ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడగబోతుండగా నందు పిలవడంతో అతను వెళ్లిపోతాడు.

జాను బాధపడుతుంటే పారు వచ్చి ఓదారుస్తుంది. నీ బాధ అర్థం చేసుకోగలను.. త్వరలోనే మీ వాళ్లు నిన్ను అర్థం చేసుకుని దగ్గరకు తీసుకుంటారని ధైర్యం చెప్తుంది. అలాగే పెళ్లి ఎలా జరిగినా నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయావ్.. పుట్టింటి గురించే కాదు అత్తింటి గురించి కూడా ఆలోచించాలని చెప్తుంది. ఎవరేం అనుకున్నా నువ్వు ఈ ఇంటి కోడలివి.. కోడలిగా బాధ్యతలు తీసుకోవాలి.. ఇంటికి కోడలు వస్తే ఇల్లు కళకళలాడాలి.. లక్ష్మీ కళ రావాలి అంటుంది. ఇంటి ముందు తులసి చెట్టు వాడిపోయింది.. దేవుడి గది కొత్త కోడలి పూజ కోసం ఎదురు చూస్తోందని చెప్పడంతో జాను ఆలోచనలో పడుతుంది.

ఆ తర్వాత జాను సంజయ్ గదిలోకి వెళ్లి ఇక్కడే పడుకుంటా అంటుంది. సంజయ్ వద్దు అంటే పెళ్లయిన తర్వాత నీది నాది అంటూ ఏం ఉండదని జాను అంటుంది. ఇక్కడ పడుకోవద్దు అని సంజయ్ అంటే తాతయ్య, నానమ్మకి చెప్తానని జాను గట్టిగా అరుస్తుంది. దీంతో సంజయ్ భయపడి పడుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే జాను బెడ్ ఎక్కుతుంటే వద్దని కింద పడుకోమని చెప్తాడు. దీంతో జాను కింద పడుకుంటుంది. వీళ్లిద్దరి మధ్య ఇంకా దూరం ఉన్నా, జాను మాత్రం భార్యగా హక్కును చూపించాలని ట్రై చేస్తోంది.

ఉదయం లేవగానే జాను తులసి కోట చుట్టూ పూజలు చేస్తుంది. శబ్దం విని శివుడు పారుని లేపి ఎవరో పూజలు చేస్తున్నారని చెప్తాడు. ఇద్దరూ బయటకు వచ్చి చూసేసరికి జాను పూజలు చేయడం చూసి చాలా హ్యాపీ అవుతారు. రాత్రి చెప్పానని పారు అంటే నువ్వు చెప్పడం గొప్ప కాదు.. తను విని చేయడం గొప్ప అని శివుడు మెచ్చుకుంటాడు. జాను వాళ్లను చూసి సంతోషంగా గుడ్ మార్నింగ్ అనడంతో అందరు గుడ్ మార్నింగ్ అని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com