.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -130 లో.... జానుతో సూర్య ఎమోషనల్ గా మాట్లాడుతుండగా జానుకి మురళీ కాల్ చేసి శారదకి ఏ ప్రమాదం లేదు.. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తామని చెప్తాడు. ఆ విషయం తెలియగానే సూర్య చాలా సంతోషపడతాడు. మన ప్రేమకి అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి.. మన ప్రేమ ఇక గెలుస్తుంది.. మన ప్రేమని మనం గెలిపించుకుందామని అంటాడు. మా అమ్మ మన ప్రేమని ఒప్పుకుంటుంది.. మీ ఇంట్లో వాళ్లని నేను ఒప్పిస్తా.. మనం జీవితాంతం కలిసే ఉందాం జాను అని సూర్య సంతోషంగా జానుని హగ్ చేసుకుంటాడు. అప్పుడే సూర్యని తోసేస్తుంది జాను. ఆ తోపులాటలో జాను మెడలో ఉన్న తాళి బయటపడుతుంది.
జాను మెడలో తాళిని చూసి సూర్య షాక్ అయిపోతాడు. నీ మెడలో ఈ తాళి ఏంటి, అయ్యో జాను నేనేం చూస్తున్నాను..నాకు పెళ్లి అయిందని నువ్వు పెళ్లి చేసుకున్నావా.. లేక నన్ను ఆటపట్టించాలని ఈ తాళి వేసుకున్నావా అని సూర్య ఏడుస్తూ అడుగుతాడు. సమాధానం చెప్పు జాను నా గుండె ఆగిపోయినట్లు అవుతుంది.. ఈ తాళి నీ మెడలోకి ఎలా వచ్చింది..ఎవరు కట్టారని సూర్య అడుగుతాడు. అప్పుడే అక్కడికి సంజయ్ వచ్చి జానుని చూసి ఇక్కడేం చేస్తున్నావ్ వెళ్దాం పదా అని అంటాడు. తాళి నా మెడలో తనే కట్టాడని జాను అంటుంది. పాపం సూర్య సంజయ్ ని చూసిన చూపు చాలా బాధగా ఉంటుంది. నన్ను ఆటపట్టిస్తున్నావ్ కదా జాను అని సూర్య ఏడుస్తూ అడిగినా నాకు పెళ్లైంది.. తనే పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి సంజయ్ తో వెళ్లిపోతుంది జాను.
జాను వెళ్లి కారులో కూర్చోగానే సంజయ్ జానుతో కఠినంగా మాట్లాడతాడు. ప్రేమికుడిని కలవడానికి ఇంత దూరం వచ్చావా.. మన మధ్య అగ్రిమెంట్ ఉంది, అది పూర్తయ్యే వరకు ఇలాంటివి చేయకని అంటాడు. వారానికి ఒకసారి వెళ్లి నీ లవర్ ని ఓదార్చడం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు.. గడువు పూర్తయిన తర్వాత నీ ఇష్టం అని సంజయ్ కరాఖండీగా చెప్తాడు. జాను వదిలేసి వెళ్లిపోవడంతో సూర్య రోడ్డు మీద కుప్పకూలిపోయి గుండె పగిలేలా ఏడుస్తాడు. సూర్యని ఆపడం తన ఫ్రెండ్ వల్ల కూడా కాదు. ఇంటి దగ్గర పార్వతి, శివుడు కంగారుపడుతుండగా సంజయ్ జానుని తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
