.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గోదావరి'. సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-145లో.. జాను పుట్టింటి వాళ్లు రిసెప్షన్ కి రావడంతో ఆమె చాలా హ్యాపీ అయిపోతుంది. శారద మాత్రం జానుతో మాట్లాడకుండా దూరంగా ఉంటుంది కానీ జాను బామ్మ, తాతయ్యని చూసి ఎమోషనల్ అయిపోయి గట్టిగా హత్తుకుంటుంది. అందరిని స్టేజ్ మీదకు తీసుకెళ్లి సంజయ్ తో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఈ సంతోషాన్ని చూసి సంజయ్ "వచ్చిన ఇంత సేపటికి నీ ముఖంలో సంతోషం చూశా" అంటే జాను థ్యాంక్స్ చెప్తుంది. కానీ ఇదే సంతోషాన్ని దూరం నుంచి చూసి సూర్య మాత్రం లోపల్లోపల చాలా ఫీల్ అవుతాడు. అదే సమయంలో జాను ఫ్రెండ్ నిత్య రిసెప్షన్ కి ఎంట్రీ ఇస్తుంది. వచ్చీ రాగానే జానుకి కంగ్రాట్స్ చెప్పి తనని తాను సంజయ్ కి జాను ఫ్రెండ్ గా పరిచయం చేసుకుంటుంది. జానుని హగ్ చేసుకుని.. నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఈ పెళ్లి చేసుకోవడమే అంటూ సందడి చేసి సెల్ఫీ తీసుకుంటుంది. ఆ తర్వాత నేరుగా సూర్య దగ్గరకు వెళ్లి.. ఏం బావా ఏం సాధించావ్, ప్రేమ ప్రేమ అని తిరిగావ్.. చివరికి వదిలేసింది కదా, నన్ను పెళ్లి చేసుకో బావ హ్యాపీగా చూసుకుంటానంటూ తన మనసులో మాట బయటపెడుతుంది నిత్య. మరోవైపు నందు తన ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఎక్కడికి వెళ్లారని కంగారు పడితే, పక్కింటి ఆవిడ వచ్చి.. మీ ఇంట్లో అందరూ మీ చెల్లి ఫంక్షన్ కి వెళ్లారని చెప్పడంతో వద్దన్నా వెళ్లారా, వాళ్ల సంగతి చెప్తానంటూ నందు రగిలిపోతుంది.
కాసేపటికి సింహాద్రి ముందుగానే శేషు మనసులో విషం నింపుతాడు. ఒక అమ్మాయి ఊర్లో ఒకడిని ప్రేమించి, సిటీకి వచ్చి కోటీశ్వరుడిని మాయచేసి పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి మీ జాను, ఆ కోటీశ్వరుడు మీ కొడుకు సంజయ్, ప్రేమించిన వాడు నా మేనల్లుడు సూర్య అని శేషుకి చెప్పి రెచ్చగొడతాడు. దీంతో శేషులో అనుమానం మొదలవుతుంది. ఇక రిసెప్షన్ స్టేజ్ మీద అందరు ఉండగానే సింహాద్రి తన ప్లాన్ అమలు చేస్తాడు. అందరి ముందు పెద్ద స్క్రీన్ పై సూర్య, జానుల లవ్ వీడియో, ఫోటోలు వేసి వారి గత ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి జాను పరువు తీయాలని చూస్తాడు.
ఆ వీడియో స్క్రీన్ పై ప్లే అవ్వగానే రిసెప్షన్ లో ఉన్నవారందరూ షాక్ అవుతారు. సూర్యని జాను ప్రేమించిన విషయం అందరికి తెలిసిపోవడంతో జాను కుటుంబం తలదించుకుంటుంది. జానుకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ నిలబడిపోతుంది. శారద, బామ్మతో సహా అందరు సూర్య, జానుల వైపు కోపంగా చూస్తారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక జాను కుప్పకూలిపోతుందనే సమయంలోనే సంజయ్ జానుకి అండగా నిలబడతాడు. ఇది తన ప్లాన్ అని సింహాద్రి నవ్వుతూ చూస్తుంటే సంజయ్ మాత్రం ధైర్యంగా ముందుకు వస్తాడు. వెంటనే సంజయ్ మైక్ తీసుకుని.. జాను నా భార్య, ఆమె గతం ఏదైనా నాకు అనవసరం, ఆమె ఇప్పుడు నా భార్య మాత్రమే అంటూ గట్టిగా అందరి ముందు చెప్తాడు. సింహాద్రి చేసిన ఈ చీప్ ట్రిక్ ని ఖండిస్తూ జానుని తన వెనకాల నిలబెట్టుకుని సపోర్ట్ చేస్తాడు. మరి సింహాద్రి తర్వాత ఏం చేస్తాడు. శేషు ఈ వీడియో చూసి జానుని ఇంటి నుంచి పంపిస్తాడా.. నిత్య సూర్యని పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
