
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -129 లో... జాను తన తల్లి కోసం హాస్పిటల్ కి వెళ్లాలని రోడ్డు మీదకు వచ్చి ఆటోల కోసం చూస్తూ ఉంటుంది. మరోవైపు సూర్య తన ఫ్రెండ్ ని తీసుకుని జాను కోసం వెతుకుతూ ఉంటాడు. జాను దగ్గరకు ఓ ఆటో వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లాలని జాను చెప్పడంతో ఆ ఆటో డ్రైవర్ చెడు దృష్టితో చూసి తప్పుగా మాట్లాడి ఆటోలో ఎక్కించాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో సూర్య వాళ్లు అక్కడికి వస్తారు. మొదట సూర్య ఫ్రెండ్ జానుని కాపాడటానికి వెళ్తాడు. ఆ తర్వాత సూర్య జానుని చూసి పరుగున వెళ్లి ఆటో డ్రైవర్ ని చితక్కొడతాడు. రేయ్ నా జానురా అని సూర్య చాలా హ్యాపీ అయిపోతాడు.
దేవుడా నా నిరీక్షణ ఫలించింది, నా జాను నాకు కనిపించిందంటూ సూర్య తన బాధ మొత్తం చెప్పుకుంటాడు. జాను నీ కోసం చాలా తిరుగుతున్నా.. మురళీ నా నెంబర్ బ్లాక్ చేశాడని అంటాడు. కానీ జాను మౌనంగా చూస్తూ ఉంటుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావని సూర్య అడిగితే జాను విషయం చెప్తుంది. సూర్య జాను చేయి పట్టుకుని.. పదా జాను అంటే, జాను చేయి తీసేస్తుంది. దీంతో సూర్య షాక్ అయి.. నా మీద కోపమా జాను అని కన్నీరు పెట్టుకుంటాడు.
ఏంటి జాను నన్ను మర్చిపోయావా, మన ప్రేమని అబద్ధం చేశావా.. నీ కోసం వెతుకుతూ యాక్సిడెంట్ కూడా అయింది.. మాట్లాడు గోదారమ్మాయ్.. ఈ పడవబ్బాయ్ ని చూశాక నీకు సంతోషంగా లేదా అని సూర్య ప్రశ్నిస్తాడు. దానికి జాను.. నిన్ను హాస్పిటల్ లో చూశా సూర్యా, కిన్నెరను హాస్పిటల్ లో జాయిన్ చేశాం.. అక్కడ మీ ఆవిడ నీకు సేవలు చేస్తుంటే చూశా.. అందుకే నీకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాలేదని అంటుంది.
మీ ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుంది కదా, ఇంకా నా వెంట ఎందుకు పడుతున్నావని జాను అనగానే సూర్య పెద్దగా నవ్వుతాడు. నిత్యతో నాకు అసలు పెళ్లే కాలేదు.. ఇన్నాళ్లు నేను నిత్యని పెళ్లి చేసుకున్నా అనుకున్నావా.. నేను నిన్ను మోసం చేయను.. నీ ప్రేమని మోసం చేయను. ఈ దెబ్బలు, ఈ కట్లు ఎలా అయ్యాయో తెలుసా.. నిత్యని పెళ్లి చేసుకోను అన్నానని.. నీ కోసం తిరుగుతున్నానని మా మామయ్యే నాకు యాక్సిడెంట్ చేశాడు. మన ప్రేమని గెలిపించుకుంటానని నాకు నమ్మకం ఉందని సూర్య నిజం చెప్తాడు. నిజంగా నిత్యని పెళ్లి చేసుకోలేదా అని జాను ఏడుస్తూ అడిగితే నిజం జాను, మా అమ్మ పెళ్లి ఆపేసింది.. ఇప్పుడు మా అమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకుంటుందని సూర్య హ్యాపీగా చెప్తాడు.
మరోవైపు రమణి మెయిన్ డోర్ తెరిచి ఉందని తల్లిదండ్రులకు చెప్తుంది. అందరూ సీసీకెమెరాలో చూసి జాను బయటకు వెళ్లిందని తెలుసుకుని సంజయ్ ని పిలుస్తారు. నీ భార్య నీ గదిలో నుంచి బయటకు వెళ్లడం నీకు తెలీదా అని అందరు అడిగితే సంజయ్ పట్టనట్టు మాట్లాడతాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పారు, శివుడు టెన్షన్ పడతారు. మీరు టెన్షన్ పడొద్దు, తను ఎక్కడున్నా నేను తీసుకొస్తానని సంజయ్ బయటకు వెళ్తూ తను దొరికితే నా చేతిలో అయిపోతుందని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






