Home

»

Tv News

జెమినీ టీవీనే నాకు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్... అప్పుడు మిస్సమ్మ, ఇప్పుడు మంగపతి

Oct 8, 2026 2:10PM

 మంగపతి అన్న పేరు వింటే చాలు గుర్తొచ్చే వ్యక్తి హీరో శివాజీ. అలాంటి శివాజీ రీసెంట్ గా టేస్టీ తేజ నిర్వహిస్తున్న వంటల కార్యక్రమం "వంటాస్టిక్" షోకి వచ్చాడు.  అందులో తేజ శివాజీని ఇంటర్వ్యూ చేసాడు. శివాజీ కూడా ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను చాలా సందర్భాల్లో చెప్పాను శివాజీ అన్న కాదు శివాజీ నాన్న అని . నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉంటాడు. మూడేళ్లు దాటింది మా స్నేహం. నేను ఏ టైంకి ఫోన్ చేసినా రెస్పాండ్  అవుతారు. ఏది కావాలి అన్నా లేదు అనకుండా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తనకు అవసరం లేకపోయినా ఏ ఫేవర్ అడిగినా చేస్తారు. " అని చెప్పారు.

తర్వాత శివాజీ కూడా కొన్ని విషయాలు చెప్పారు. "నేను సన్ జెమినిలో ఎడిటర్ గా జాయిన్ అయ్యాను. జెమినీ టీవీకి ప్రోగ్రామ్స్ ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని. బతుకుదామని వచ్చాను. ఈ ఆర్టిస్ట్ అనే గోల నాకు తెలీదు. ఏదో కుదిరింది కాలం కలిసొచ్చింది. కావాలని ఉంది. అవకాశాలు వచ్చాక ఎక్కడా కూడా ఒళ్ళు దాచుకోకుండా డబ్బు ఇచ్చినవాడికి న్యాయం చేయడం ఈ క్షణం వరకు మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోను. జెమినీ టీవీనే నాకు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్.  నా కెరీర్ టర్నింగ్ పాయింట్ మిస్సమ్మ మూవీ. రి-ఎంట్రీ విషయానికి వస్తే మంగపతి రోల్ చేసిన కోర్ట్ మూవీ. " అని చెప్పారు.

"జనాల్లో మంగపతి క్యారెక్టర్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది "అని తేజ అన్నాడు. వెంటనే శివాజీ "ఎప్పటికీ ఉంటుంది ఆ ఎఫెక్ట్.   ఆడపిల్ల ఉన్న ప్రతీ ఫ్యామిలీలో ప్రతీ వాడు మంగపతే. ఈ సమాజంలో, ఈ సంస్కృతిలో ఆడపిల్లను ఒక అమ్మవారిలా చూసుకుంటారు. కాబట్టి అమ్మవారిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. సినిమాలో మంగపతి కొంచెం ఎక్సట్రా చేసాడు కానీ. మెజారిటీ వాళ్ళల్లో ఉన్న భయం నుంచి వచ్చిన జాగ్రత్త ఉంటుంది. " అని చెప్పాడు శివాజీ.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com