Ye Devi Varamo Neevu: బిల్ కట్టలేక ముత్యలరాజు..పోలీసులని చూసి రాకీ,రోహిత్ షాక్!
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు. ఈ సీరియల్ బుధవారం ఎపిసోడ్-102 లో అంజలికి గీత బ్లడ్ ఇస్తుంది. గీత బ్లడ్ ఇస్తున్న బెడ్ పక్కనే ముత్యాలరాజు ఉంటాడు, తనకి కుక్క కరిచిందని ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఒక దయగల తల్లి బ్లడ్ ఇవ్వడం వల్లే ఆ అమ్మాయి బతికి ఉందని నర్సు అనడంతో ముత్యాలరాజు ఎవరు ఆ దయగల తల్లి అని చూడబోతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి బిల్ కట్టి వెళ్లమని చెప్తాడు. ఈ బిల్ నేను ఎలా కట్టాలని, ఈ దయగల తల్లిని అడుగుదామని చూసేలోపు గీత అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఎలా బిల్ పేమెంట్ చేయాలి.. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ముత్యాలరాజు అనుకుంటాడు.
మరోవైపు అత్తయ్య నిన్ను తప్పు అనుకున్నాం, ఈ పరిస్థితిలో కూడా అంజలి మీద కోపం ఏంటి అనుకున్నామని మనీష్ అనగానే ఒక అమ్మాయి గురించి ఎలా ఆలోచించకుండా ఉంటానని గీత అంటుంది. ఆ తర్వాత హాస్పిటల్ కి పోలీసులు వస్తారు.. మేడం ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకుంటే తప్ప ఏం చేయలేమని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఇప్పుడు స్పృహలో లేదని మనీష్ చెప్తాడు. సంఘటన జరిగిన ప్లేస్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇన్‌స్పెక్టర్ అనగానే గీత సరే అంటుంది. పోలీసులను చూసిన రాకీ, రోహిత్ కంగారు పడతారు. ఇన్‌స్పెక్టర్ ఇంటికి వెళ్లి భవిత వాళ్లతో మాట్లాడుతాడు. అప్పుడే రోహిత్, రాకీ వస్తారు.
మరోవైపు హాస్పిటల్ లో గీతని ముత్యాలరాజు చూసి మాట్లాడడానికి వస్తుంటే గీత దగ్గరికి బాను వస్తాడు. దాంతో ముత్యాలరాజు ఆగిపోతాడు. గీత బ్లడ్ ఇచ్చిన విషయం ముత్యాలరాజుకు తెలిసేలోపు ఆమె బయటకు వెళ్లిపోవడం, బిల్ కట్టలేక అతను తప్పించుకోవాలనుకుంటాడు.పోలీసుల ఎంట్రీతో రాకి, రోహిత్ భయపడటం, ఇన్వెస్టిగేషన్ ఎటు వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు బాను రావడంతో ముత్యాలరాజు గీతతో మాట్లాడలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
