Home

»

Tv News

Ye Devi Varamo Neevu: అంజలి, మనీష్ క్లోజ్‌నెస్ చూసి రగిలిపోయిన భవిత.. రోహిత్ జస్ట్ మిస్!

Oct 21, 2026 4:50PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమీ నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-95 లో..  ముత్యాల్ రావు పేపర్ లో రాసి గీత కారు అద్దానికి పెడతాడు.  అదే సమయంలో వర్షం పడుతుంది. అది చూడాలని ముత్యాల్ రావు దూరం నుండి చూస్తాడు. గీత అది చూస్తుంది కానీ వర్షం వల్ల అందులోని అక్షరాలన్నీ పోతాయి. ఆ పేపర్ ని పక్కన పడేస్తుంది గీత. దాంతో ముత్యాల్ రావు డిసప్పాయింట్ అవుతాడు. మరోవైపు ఇంట్లో ఉన్న అంజలి రోహిత్ చెడిపోతున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనీష్ వచ్చి.. తనకి దోశ కావాలని అడుగుతాడు. ఇక పరధ్యానంలో ఉన్న అంజలి దోశ  మాడగొడుతుంది.

ఇక ఎందుకిలా చేశావని మనీష్ అంటాడు. మళ్ళీ చేస్తానని అంజలి అనగా నాకు వచ్చు అని అంటాడు. సరే చెయ్ అని అంజలి అనగా మనీష్ దోశ పిండితో గందరగోళం చేస్తాడు. ఇక మనీష్ కి దోశ ఎలా చేయాలో అంజలి నేర్పిస్తుంది. అదంతా దూరం నుండి భవిత చూసి.. వీళ్ళు చాలా దూరం వెళ్తున్నారు.. ఏదో ఒకటి చేసి అంజలిని పంపించాలని భవిత అనుకుంటుంది. మరోవైపు రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ తో రూమ్ లో ఉండటం చూసి వాళ్ళ నాన్న తనని కొట్టడం గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. అదే సమయంలో  అంజలి తనకి పడట్లేదని రాకీ ఆలోచిస్తుంటాడు. నా గురించి కాకుండా ఆ అంజలి గురించి ఆలోచిస్తున్నావా బావ అంటు రాకీని రోహిత్ అడుగగా లేదు నీ గురించే ఆలోచిస్తున్నానని అంటాడు.

నువ్వు మీ డాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్ అంటూ ఒక ప్లాన్ చెప్తాడు. సరే అని రోహిత్ వాళ్ళ డాడి భాను దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో భాను ఒంటరిగా కూర్చొని ధీర్ఘంగా ఆలోచిస్తుంటే అక్కడికి గీత వచ్చి.. విషయం ఏంటని అడుగుతుంది. నాకు రోహిత్ గురించి టెన్షన్ గా ఉందని అంటాడు. ఎందుకని ఏదైనా తప్పు చేశాడా అని గీత అడగగా లేదని రోహిత్ ని అమెరికా పంపిద్దాం.. అక్కడ బాగా చదువుకుంటాడని భాను అనగా వద్దు.. వాడు నా దగ్గరే ఉండాలని గీత అంటుంది. అదంతా గుమ్మం దగ్గర ఉండి రోహిత్ చాటుగా ఉంటాడు. డాడి నా గురించి చెప్పొద్దంటూ రిక్వెస్ట్ చేయడంతో అంజలితో అసలు విషయం చెప్పకుండా కవర్ చేస్తాడు భాను. ఆ తర్వాత భాను బయటకు వస్తాడు. రోహిత్ వెళ్ళి మాట్లాడాలని అంటాడు. నువ్వేం మాట్లాడాలని అనుకుంటున్నావో నాకు తెలుసు.. మీ అమ్మతో చెప్పలేదు కదా అని భాను అంటాడు. థాంక్స్ డాడీ అని రోహిత్ అంటాడు. నీ గురించి కాదు గీత గురించి ఆలోచించి చెప్పలేదని భాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com