Home

»

Tv News

Ye Devi Varamo Neevu : అంజలి కోసం మనీష్ వేట.. నడిరోడ్డుపై నవ్వులు పూయించిన లవ్ ట్రాక్!

Jul 21, 2026 10:25AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో..... అంజలిని తీసుకొని రమ్మని రాజారాం తన మనవడు మనీష్ కి చెప్తాడు. దాంతో వైజాగ్ లోని శబరి అనాధాశ్రమంలో ఉన్న అంజలి దగ్గరికి మనిష్ వెళ్తాడు. కానీ అతన్ని చూసి అంజలి కోప్పడుతుంది. దాంతో మనీష్ కోపంగా వెళ్ళబోతాడు కానీ వాళ్ళ తాతయ్యకి ఇచ్చిన మాట గుర్తుచేసుకొని ఆగి మళ్ళీ అంజలి ప్లీజ్ నాతో వచ్చేయమని చెప్తాడు. నేను రానని గేట్ కి తాళం వేస్తుంది. నువ్వు వచ్చేవరకు నేను ఇక్కడ నుంచి కదలనని మనీష్ అంటాడు. మరుసటి రోజు మనీష్ లేచేసరికి అంజలి అక్కడ ఉండదు. అంజలి కోసం మనీష్ అంతా వెతుకుతాడు.

మరొకవైపు ఉదయం లేచి గీతాంజలి యోగా చేస్తుంది. తన భర్త లేటుగా వచ్చి తనకి సారీ చెప్తాడు. తన కూతురు లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ ఇస్తుంది గీతాంజలి. ఆ తర్వాత అక్కడ కాకి అరుస్తుంటే.. గీత కాకి అరుస్తే ఇంటికి చుట్టాలు వస్తారని అంటారని భానుచందర్ అంటాడు. నీకు ఈ మధ్య చాదస్తాం ఎక్కువ అయిందని గీతాంజలి అంటుంది. మరొకవైపు బస్సు కోసం బ్యాగ్ తో అంజలి వెయిట్ చేస్తుంది. తనని వెతుక్కుంటూ మనీష్ వస్తాడు. ఏంటి నా వెంట పడుతున్నావని అంజలి కోప్పడుతుంది. అంజలి ఎక్కడికి  వెళ్లినా తన వెనకాలే మనీష్ వెళ్తాడు.

అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి అంజలి వెళ్తుంది. వాళ్ళతో నన్ను అతను ఏడిపిస్తున్నాడని అంజలి చెప్తుంది. దాంతో తను నా మరదలు కావాలంటే చూడండి.. ఇప్పుడు మూడు లెక్క పెట్టేవరకు నా వైపు చూస్తుందని మనీష్ కౌంట్ చేస్తాడు. మూడు లెక్క పెట్టేసరికి అంజలి తన వంక చూస్తుంది. చూసారా ఇప్పటికైనా నమ్ముతారా అని మనీష్ అంటాడు. తరువాయి భాగంలో రాజారాం దగ్గరికి అంజలి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
    

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com