Jayam serial:గాయాలతో ఇంటికొచ్చిన గంగ.. పట్టించుకోని శకుంతల!
on Dec 10, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -137 లో.....గంగ నగలు వేసుకోవడంతో శకుంతల కోప్పడుతుంది. నిన్ను ఎప్పటికి కోడలిగా ఒప్పుకోనని శకుంతల చెప్తుంది. దాంతో గంగ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. గంగ ఏడుస్తుంటే ఇషిక, వీరు కలిసి తన దగ్గరికి వెళ్తారు. నేనే నగలు ఇచ్చానని ఇషిక అనగానే అయ్యో అలా ఎందుకు చేసావ్ ఇషిక.. పాపం ఇప్పుడు గంగ సిచువేషన్ చూడమని వీరు అంటాడు.
ఇప్పుడు రుద్ర బావ చూడు కోపంగా వెళ్ళాడు.. ఇలా వెళ్తే ఎలా అని లేని డౌట్ గంగలో వీరు క్రియేట్ చేస్తాడు. దాంతో గంగ బయటకు వెళ్లి రుద్ర కార్ వెంబడి పరుగెడుతుంది. గంగ రావడం చూసి రుద్ర కార్ ఆపుతాడు. ఎందుకు ఇలా వస్తున్నావని అడుగుతాడు. మీకు ఏమైనా అవుతుందోనని భయంతో వచ్చానని గంగ అంటుంది. సరే క్యాబ్ బుక్ చేస్తాను వెళ్ళమని రుద్ర అనగానే వద్దు షేర్ ఆటోలో వెళ్తానని గంగ అంటుంది. షేర్ ఆటో రావడంతో గంగని రుద్ర షేర్ ఆటో లో ఎక్కిస్తాటు. డ్రైవర్ కి లైసెన్స్ ఉందా లేదా అని కనుక్కుంటాడు. ఆ తర్వాత ఆటోలో ఉన్న వాళ్లంతా మీ భర్తకి మీరంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు ఉందని అంటారు. అది చూసి గంగ మురిసిపోతుంది.
ఆ తర్వాత రుద్ర ఒక దగ్గర ఆగుతాడు. షేర్ ఆటోకి ఆక్సిడెంట్ అయిందని అక్కడ అనుకుంటుంటే విని వెంటనే అక్కడికి వెళ్తాడు. ఆటోలో ఉన్నవాళ్ళకి దెబ్బలు తాకుతాయ్.. గంగకి కూడా చిన్నగా దెబ్బలు తాకుతాయి. మరొకవైపు శకుంతల నగలు తీసుకొని వచ్చి పారుకి ఇస్తుంటే.. వద్దు ఆ నగలు గంగ వేసుకుందని అంటుంది. మరి రుద్ర బావని గంగ పెళ్లి చేసుకుంది కదా వదిలేస్తావా అని ఇషిక అనగానే రుద్ర వేరు అని పారు అంటుంది. అప్పుడే దెబ్బలతో ఉన్న గంగని తీసుకొని వస్తాడు రుద్ర. శకుంతల ఏం పట్టనట్లు ఉంటుంది. ప్రమీల, ప్రీతీ తన గురించి కేర్ తీసుకుంటారు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదని రుద్ర తనకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



