Home

»

Tv News

టాస్క్ లో అపూర్వను ఎలిమినేట్ చేసిన హౌస్ మేట్స్.. దోమలా నరేష్ కామెడీ!

Oct 10, 2026 9:33AM

బిగ్ బాస్  తెలుగు సీజన్-10 డే 33 ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్ హౌస్ లో నవ్వులు పూయించింది. "ఫ్లిప్ చెయ్, ఫేస్ చెయ్" అనే టాస్క్ లో కంటెస్టెంట్లు ఫ్లిప్ చేసినప్పుడు కార్డులో ఏం రాసి ఉంటే అది చేయాల్సి ఉంటుంది. సంచాలకులుగా దేబ్జాని, ఝాన్సీ ఉన్నారు.

ఈ టాస్క్ లోనే అత్యంత ఆసక్తికర ఘటన జరిగింది. అపూర్వ ఫ్లిప్ చేయగా.. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఒకరిని ఎలిమినేట్ చేయాలని వచ్చింది. దీంతో అందరూ ఓటింగ్ పెట్టి అపూర్వనే ఎలిమినేట్ చేశారు. ముఖేశ్ ఫ్లిప్ లో 5 వియర్డ్ ఫేస్ లు పెట్టాలని రాగా అతను రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో అలరించాడు. నరేష్ కి దోమలా నటించాలని టాస్క్ రాగా అతను చేసిన కామెడీ హైలెట్ గా నిలిచింది. దేబ్జాని దగ్గరికి వెళ్లి.. బ్లడ్ స్మెల్ కంటే బటర్ స్మెల్ వస్తుందని, షాలిని దగ్గరికి వెళ్లి.. పక్కనే డేంజర్ ఉందని రోహిత్ ని చూపిస్తూ కామెడీ చేశాడు. తర్వాత వర్షిణితో ఫ్లర్టింగ్ చేయడంతో హౌస్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.

అదే టాస్క్ లో నరేష్ మరోసారి ఫ్లిప్ చేయగా డైస్ రోల్ చేసి హైయెస్ట్ నంబర్ వచ్చిన వారిని ఎలిమినేట్ చేయాలని వచ్చింది, దీనిలో షాలినికి హైయెస్ట్ నంబర్ వచ్చింది. ఈ టాస్క్ పూర్తయ్యేసరికి నరేష్, రామ్ ప్రసాద్ జోడీ లీడర్ బోర్డులో 220 పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా ఫ్లిప్ చెయ్ ఫేస్ చెయ్ టాస్క్ హౌస్ లో ఒకవైపు ఫన్, మరోవైపు ఎలిమినేషన్ టెన్షన్ రెండింటినీ తీసుకొచ్చింది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com