Home

»

Tv News

ఆ రోజుల్లో గోడ దూకి చిరు సినిమాలు చూసిన రోజా!

May 18, 2026

హీరోయిన్ రోజా ఫ్రెండ్ రియల్ స్కూల్ ఫ్రెండ్ రాధ ఫామిలీ అసెంబ్లీ షోకి వచ్చి ఆ రోజుల్లో రోజా చేసిన అల్లరి పనుల గురించి హీరో చిరు మూవీస్ గురించి చెప్పుకొచ్చారు. "నేను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మగారు అనేవాళ్ళు నీకు మంచి ఫీచర్స్ ఉన్నాయి నువ్వు హీరోయిన్ అవ్వొచ్చు కదా అనేవారు ఆంటీ. నేను హీరోయిన్ అయ్యాక చాలా ఇంటర్వ్యూలో  రాధ గురించి ఆంటీ గురించి చెప్పాను.

మేము 6 వ తరగతి నుంచి ఫ్రెండ్స్. నా బండి మీద నేను రాధా, లతా, హసీనా అందరం ఒక బైక్ మీద తిరుపతి అంతా రౌండ్స్ వేసేవాళ్ళం. అబ్బాయిలు చేసే పనులన్నీ చేసేవాళ్ళం. మా కాలేజ్ చాల స్ట్రిక్ట్ . ఎలా అంటే ఉదయాన్నే మా పేరెంట్స్ వచ్చి కాలేజ్ లో దింపాలి వెళ్ళేటప్పుడు వాళ్ళతోనే వెళ్ళాలి. అందుకే గోడ వెనక సైకిల్స్ పెట్టి ఒకరి భుజం మీద ఒకళ్ళం ఎక్కి గోడ దూకి బయటకు వచ్చి అటు సైడ్ నుంచి సినిమాకు వెళ్లిపోయేవాళ్ళం. మళ్ళీ వచ్చి ఆ సైడ్ నుంచే కాలేజ్ లోకి వెళ్లి సాయంత్రం మా పేరెంట్స్ తో వెళ్లిపోయేవాళ్ళం. కాలేజ్ ఎగ్గొట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి గారి సినిమాకు వెళ్లిపోయేవాళ్ళం.

చిరు గారి సినిమా ఫస్ట్ డే అంటే అలా ఉంటుంది మరి. అలా చిరు గారి సినిమాలు చూసి ఆయనతోనే మూవీ చేసే అవకాశం వచ్చినప్పుడు చాల సంతోషంగా ఉంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఊటీలో "ఎంత ఘాటు ప్రేమయో" సాంగ్ షూటింగ్. ఆయన్ని చూడడమే ఫస్ట్ అంటే ఆయనతో డాన్స్ పెట్టేసారు. ఆ డాన్స్ లో మీరు చూసుంటారు మా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుందని సురేఖా గారు చెప్పారు." అన్నారు రోజా. "అమ్మా చిన్నప్పుడు రోజా గారు ఇన్నోసెంట్ గా " అని టేస్టీ తేజ అడిగాడు. "అవును నేను చాలా ఇన్నోసెంట్ అని చెప్పిన ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు. మా ఆయన కూడా నా ఇన్నోసెన్స్ చూసే 1991 లో పడిపోయారు. తర్వాత తెలిసింది పాలిటిక్స్ లోకి వచ్చాక అమ్మా అని " అని చెప్పారు రోజా. "మీరు చెప్పండి ముందు సర్ లైన్ వేసారా రోజా గారా " అని జాఫర్ అడిగేసరికి "సర్ లైన్ వేశారు. రోజా చేసే ప్రజా సేవ అంటే చాల ఇష్టం. ఆమె తినేటప్పుడు ఆమె చుట్టూ కొంతమంది ఉండాలి" అని రోజా ఫ్రెండ్ చెప్పారు. "అంటే నేను ఎక్కడికి వెళ్లినా ఫుడ్ మాత్రం అందరికీ పెడతాను. అందరూ హ్యాపీగా తినాలి." అని చెప్పారు రోజా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com