.webp)
డ్రామా జూనియర్స్ ప్రోమో సరికొత్తగా రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక బుడత వచ్చింది మాములుగా లేదు. జడ్జెస్ తో వారేవా అనిపించుకుంది. రాగానే "అనిల్ గారు శ్రీకాంత్ గారు నమస్కారం" అని చెప్పింది. "రోజా గారికి నమస్కారం పెట్టవేంటి" అని హోస్ట్ సుధీర్ అడిగాడు. "అమ్మకే పెట్టను ఇంకా రోజమ్మకేం పెడతాను" అంది చిన్నారి కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వైశాలి. దాంతో రోజా ఆశ్చర్యంగా ఫేస్ పెట్టారు. "మీ అమ్మగారంటే ఇష్టం లేదా" అని అడిగాడు సుధీర్. "ఇంట్లో సీపురు కట్టను ఎం చేయాలి. ఇల్లు ఊడవాలి. కూర గరిటెతో ఎం చేయాలి. వంట చేయాలి.
ఈ రెండు మా ఇంట్లో నా వీపు మీద పని చేస్తాయండి" అంటూ పాపం ఏడుస్తూ చెప్పింది. "రెండు నిమిషాలు ఫోన్ చూస్తే చాలు అమ్మ కాస్త అమ్మోరులా మారిపోద్ది" అంటూ చెప్పింది ఆ చిన్నారి. "ఇదిగో సుధీర్ తాత ఇటు రావా" అంటూ వేళ్ళు నోట్లో పెట్టి వీలేసి మరీ పిలిచింది. "వీల కూడా నువ్వే వేసావా" అనేసరికి మళ్ళీ వేసి చూపించింది. ఎలా వేస్తున్నావ్ అసలు అంటూ సుధీర్ అరుస్తుందా విజిల్ వేస్తుందా అది అని అనిల్ రావిపూడి డౌట్ పడ్డారు.
దాంతో గట్టిగా మళ్ళీ వీలేసింది. "విజిలే సర్ " అని సుధీర్ అనేసరికి శ్రీకాంత్ షాకయ్యారు. ఒకొక్కరి గురించి ఒక్కో స్టైల్ లో విజిల్ వేయాలి అనే టాస్క్ ఇచ్చాడు సుధీర్. రోజా గారి గురించి " బొటన వేలు, చూపుడు వేలితో" వీలేసింది. అనిల్ రావిపూడి గారి కోసం చూపుడు వేలు పక్క వేలితో వేసింది. ఇక శ్రీకాంత్ కోసం రెండు చేతుల్లోని బొటన వేళ్ళతో కలిపి గట్టిగా వీలేసింది. ఈ పిల్ల వీళ్లకు జడ్జెస్ అంతా ఫిదా ఐపోయి గ్రీన్ లైట్ ఇచ్చేసారు. ఇక రోజా ఐతే ఆ చిన్నారికి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు "ఇకనుంచి నీ పేరు విజిల్ రాణి " అనేసరికి మళ్ళీ గట్టిగా వీలేసింది. ఇక ఫైనల్ గా శ్రీకాంత్ ఆ చిన్నారి దగ్గరకు వచ్చి చెవి పెట్టేసరికి ఆమె గట్టిగా విజిల్ వేసింది. అంతే ఆయన చెవులు దిమ్మెత్తిపోయాయి.




.webp)
