.webp)
ప్రతీ వారం చిన్నపిల్లల స్కిట్స్ తో డ్రామా జూనియర్స్ లేటెస్ట్ సీజన్ మంచి ఎనర్జీని కామెడీ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తోంది. ఇక రీసెంట్ ఎపిసోడ్ కూడా అలాగే ఫుల్ ఫన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇందులో రెండు చిన్నారుల జోడీలైతే ఫుల్ జోష్ తో స్కిట్ చేశాయి. ఒక జోడిలోని వైఫ్ తన్వికి అనిల్ రావిపూడి అంటే ఇష్టం దాంతో ఆమె తన భర్తను అచ్చంగా అనిల్ రావిపూడిలా సినిమాలు తియ్యాలని సతాయిస్తూ ఉంటుంది. మరో వైపు జోడికి శ్రీకాంత్ అన్నా ఆయన సొట్ట బుగ్గలన్నా ఇష్టం అందుకే తన భర్త కూడా అలాగే ఉండాలనుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఇద్దరు పెళ్ళాలు అనిల్ రావిపూడిని, శ్రీకాంత్ ని తమ ఇంటికి భోజనానికి ఎలాగైనా తీసుకురావాలని పట్టుబట్టేసరికి ఆ ఇద్దరు భర్తలు వెళ్లి వాళ్ళను తీసుకొస్తారు.
.webp)
ఇక తన్వి, యాద్విశ్రీ వాళ్లకు భోజనాలు పెడుతూ తెగ సతాయించారు. ఇక వాళ్ళు తిందామనుకునే లోపు ఆ ఇద్దరు పిల్లలు అడిగిన ప్రశ్నలకు వామ్మో అనుకున్నారు అనిల్ రావిపూడి, శ్రీకాంత్. "ఈసారి సంక్రాంతికి వస్తున్నారా దీపావళికి వస్తున్నారా " "సర్ సినిమాలో లాగా మీ పనులు మీరే చేసుకుంటారా అదే ఇల్లు ఊడడం గిన్నెలు కడగడం " "మొన్న చిరంజీవి గారు కార్ గిఫ్ట్ ఇచ్చారు కదా దాని మైలేజ్ ఎంతొస్తుంది" "సర్ మీకు పుట్టినప్పటి నుంచే సొట్ట బుగ్గలు ఉన్నాయా లేక సినిమాల కోసం తీయించుకున్నారు " "సర్ మీ పక్కన రోజా గారు కూర్చుంటారు కదా ఆమెది నిజమైన జుట్టా లేదంటే విగ్గా " దాంతో శ్రీకాంత్ కి కోపం వచ్చి ఇంకా చాలు అసలు మీరు పెళ్ళాలా ప్రెస్ రిపోర్టర్లా, అసలు ఇన్ని ప్రశ్నలేంటి ఆ మొగుళ్లను అలా కొట్టడమేంటి అసలు మీ ఇద్దరితో వీళ్ళు ఎలా భరిస్తున్నారో ఇప్పుడు మాకు అర్ధమయిందమ్మా " అంటూ శ్రీకాంత్, అనిల్ రావిపూడి ఇద్దరూ పిల్లలతో సహా బాగా పెర్ఫార్మ్ చేశారు.





