
డ్రామా జూనియర్స్ సీజన్ 9 మెగా లాంచ్ ప్రోమో బయటకు వచ్చేసింది. రోజా, శ్రీకాంత్, అనిల్ రావిపూడి కూడా ఎంట్రీ ఇచ్చారు. "మీకో మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్న తెలుసా" అని సుధీర్ అనేసరికి "కొంపదీసి వెళ్ళిపోతావా ఏంటి" అంటూ అనిల్ రావిపూడి జోక్ వేశారు. వెంటనే సుధీర్ మళ్ళీ "రోజా గారిని పంపించేస్తున్నాం" అని సుధీర్ అనిల్ కలిసి డాన్స్ చేశారు. ఇంతలో రోజా రానే వచ్చారు. వెంటనే సుధీర్ దణ్ణం పెట్టేసాడు. "విన్నానురా మొత్తం విన్నాను. ఇంతలో అనిల్ రావిపూడి సుధీర్ భుజం మీద ఒక్కటిచ్చి "అన్ని కౌంటర్లు నేనే వేయాలా నువ్వు కూడా ఒకటేసుకో "అన్నాడు.
.webp)
ఇంతలో హీరో శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చారు. "సుధీర్ మీద పంచులు వేయడం మానేసాను " అన్నారు. "ఎందుకండీ" అని అనిల్ చాలా ఆతృతగా అడిగారు. "ఆ తర్వాత యాంకర్ గా ఆడే మానెత్తాడు" అన్నారు శ్రీకాంత్. ఇక తర్వాత పిల్లలు వచ్చారు మాములుగా లేవు వాళ్ళ మాటలు వాళ్ళ జోక్స్ విని జడ్జెస్ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక ఒక చిన్నారు వచ్చి రోజాను చూసి వెక్కిరించింది. "నేనెవరో తెలుసా నీకు " అని అడిగారు రోజా. "సారీ అండి నాకు తెలీదు" అని చెవులు పట్టుకుంది. దాంతో తలబాదుకున్నారు రోజా. మరో చిన్నారి వచ్చి శ్రీకాంతన్నా అనేసరికి "అబ్బా ఎంత బాగుందో ఆ పిలుపు " అన్నారు శ్రీకాంత్. ఇక రోజాను వెక్కిరించిన ఆ చిన్నారి వచ్చి థాంక్యూ మామయ్యా అంది. ఇక అనిల్ రావిపూడికి బాగా కోపం వచ్చేసింది. "పోయిన సీజన్ అంతా నన్ను మావయ్య అని పిలిపించి ఈ సీజన్ లో ఆయన రాగానే అటు తోసేత్తారా " అన్నారు కామెడీగా.
ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ కి బర్త్ డే విషెస్ చెప్తూ అతని పక్క విష్ణుప్రియ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సర్కార్ లేటెస్ట్ సీజన్ లో విష్ణుప్రియ సుధీర్ పక్కన కో-హోస్ట్ గా చేస్తోంది. వీళ్ళ జోడి యాంకరింగ్ కి బాగా క్లిక్ అయ్యింది. దాంతో నెటిజన్స్ ఇలా కోరుతున్నారు. మరి మేకర్స్ ఈ విషయాన్నీ ఆలోచించి విష్ణు ప్రియను తెస్తారా లేదా చూడాలి.





.webp)
