
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -483 లో.. రామరాజు వాళ్ళు భోజనం చేస్తుంటారు. సాగర్ కోసం నర్మద వెయిట్ చేస్తుంది. అప్పుడే సాగర్ వస్తాడు. ఏంటి వట్టి చేతులతో వచ్చావని నర్మద అడుగుతుంది. నాకు ఆకలిగా ఉంది వంట చేయలేదు.. సరుకులు తీసుకొని రాలేదా.. మనం వేరే కాపురం పెట్టాము.. అసలు నీకు గుర్తుందా అని సాగర్ పై నర్మద కోప్పడుతుంది. సాగర్ మౌనంగా ఉంటాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భార్య ఆకలిగా ఉంటుంది.. తనకి ఏదైనా తీసుకొని వెళ్ళాలన్న జ్ఞానం లేదా అని నర్మద కోప్పడుతుంది. ఆగు ఫుడ్ ఆర్డర్ చేస్తానని సాగర్ అనగానే ఏం అవసరం లేదని నర్మద కోపంగా వెళ్తుంది.
ఆ తర్వాత కాసేపటికి భోజనం చేస్తున్న రామరాజు వాళ్ళ దగ్గరికి నర్మద వచ్చి అత్తయ్య గారు ప్లేట్ తీసుకొని భోజనం పెట్టండి అని దబాయిస్తుంది నర్మద. ఆకలిగా ఉందని భోజనం చేస్తుంది. వదిన ఈ చట్నీ వేసుకోండి అని ధీరజ్ అంటుంటే వల్లికి కోపం వస్తుంది. నర్మద భోజనం చేసి వెళ్లిపోతు.. మావయ్య గారు గొడవ మీకు మీ అబ్బాయికి నేను ఇలాగే ఉంటాను.. నాకు అందరు కావాలని నర్మద ఎమోషనల్ అవుతుంది. వద్దని అనుకున్నది నీ మొగుడు కానీ మేం కాదమ్మా అని రామరాజు అంటాడు. ఏం చేసావ్ నర్మద అని సాగర్ తనపై కోప్పడతాడు.ఆ తర్వాత సాగర్ దగ్గరికి వేదవతి భోజనం తీసుకొని వస్తుంది. తినురా అని అంటుంది. నాకు అవసరం లేదమ్మ.. ఇన్ని రోజులు లేనిది.. ఇప్పుడు నేనున్నానని గుర్తుకువచ్చిందా అని సాగర్ అంటాడు.
సాగర్ తన మాటలతో వేదవతిని బాధపెడతాడు. అప్పుడే నర్మద వస్తుంది. ఏంటి సాగర్ నువ్వు చేస్తుందని నర్మద అడుగుతుంది. వాళ్లే అంటే నువ్వు ఒక దానివి నా ప్రాణానికి అని సాగర్ అంటాడు. వేదవతి ఏడుస్తుంటే రామరాజు చూసి కొడుకు కడుపు నింపాలని వెళ్ళావ్.. కన్నీళ్లతో వచ్చావ్.. వాడు మన బాధని అర్థం చేసుకుంటాడు.. త్వరలోనే అని రామరాజు అంటాడు. మరుసటిరోజు ప్రేమ బట్టలు పిండేస్తుంది. నీకు హెల్ప్ చేస్తానని ధీరజ్ తన దగ్గరికి వస్తాడు. తనని రొమాంటిక్ గా దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

