Brahmamudi : ట్రస్ట్ ఏర్పాటుకి ధాన్యలక్ష్మి అడ్డుకట్ట.. కావ్య ఏం చేయనుంది!
on Feb 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -954 లో.....అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి మినిస్టర్ ఇంటికి వస్తారు. లోపలికి వెళ్లొద్దని సెక్యూరిటీ అంటాడు. మరొకవైపు లోపల నా గురించి ఎవరికి చెప్పొద్దని మినిస్టర్ ని రుద్రాణి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పు, కళ్యాణ్ రావడం రుద్రాణి గమనించి రాజ్ తమ్ముడు కళ్యాణ్, కావ్య చెల్లి వస్తున్నారు.. నా గురించి చెప్పకండి అని లోపల దాక్కుంటుంది రుద్రాణి. అప్పు, కళ్యాణ్ ని సెక్యూరిటీ ఆపితే మినిస్టర్ లోపలికి పంపించమని చెప్తాడు.
పాప విషయంలో ఏం జరిగిందో తెలుసు కానీ మీరు అలా ఎందుకు చేశారు.. మీ వెనకాల ఎవరైనా ఉన్నారా అని అప్పు అడుగుతుంది. నేను చేసింది తప్పే.. ఇక నా వల్ల అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదని మినిస్టర్ అంటారు. మీ వల్ల అంటే వేరే వాళ్ళ వల్ల ఉంటుందా అని అప్పు అనగానే.. అదేం లేదు వాళ్లకి ఎప్పుడు ఋణపడి పోతానని మినిస్టర్ అంటాడు. మీకు అంత మంది పాపలలో ఆ పాపనే ఎందుకు మార్చాలని అనిపించిందని అప్పు అనగానే ఏదో అలా జరిగిపోయిందని మినిస్టర్ మాట దాటేస్తాడు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ కార్ లో ఇంటికి తిరిగి వెళ్తుంటే మినిస్టర్ ఇంటి నుండి రుద్రాణి రావడం అప్పు మిర్రర్ లోనుండి చూసి షాక్ అవుతుంది. మీ అత్త మినిస్టర్ ఇంటి నుండి రావల్సిన అవసరం ఏముందని కళ్యాణ్ ని అప్పు అడుగుతుంది.
మరొకవైపు రాజ్, కావ్య హాల్లోకి వచ్చి అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్తారు. త్వరలో మా ఫ్యామిలీ తరుపున దుగ్గిరాల కుటుంబం ఛారిటబుల్ ట్రస్ట్ అని పెడుదామని అనుకుంటున్నామని రాజ్ అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మన కుటుంబం నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తులు తనకి కేటాయిస్తున్నామని రాజ్ అనగానే అందరు ఒప్పుకుంటారు. ఒక్క ధాన్యలక్ష్మి మాత్రం ఒప్పుకోనని అంటుంది. ఆస్తులు మొత్తం కావ్య పేరున ఉన్నాయి.. ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దానికి పోతే ఇంకా మిగలింది కావ్య, రాజ్ కే కదా నా కొడుకు పరిస్థితి ఏంటని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



