Home

»

Tv News

రీతూ చౌదరి, డీమాన్ పవన్ లవ్ బ్రేకప్.. క్లారిటీ ఇచ్చి‌న ఆ పోస్ట్!

Sep 30, 2026 10:21AM

డీమాన్ పవన్, రీతూ చౌదరి  గురించి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ చాలా రోజులే సాగింది. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ఫ్రెండ్స్ అని అంటుంటారు. అయితే తాజాగా డీమాన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ పోస్ట్ చేశాడు. రీతూకి నాకు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది.. ఇక RiVan(Rithu Pavan )ఉండదని పెట్టాడు. తన ఇన్‌స్టాగ్రామ్ లో @demon_pavan అకౌంట్ లో స్టోరీ పెడుతూ "There will be No more Rivan anymore, Our Friendship got Broken Completely" అని షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

"రివాన్ గురించి నాకు కంటిన్యూగా మెసేజ్ లు వస్తున్నాయి, అందుకే క్లారిటీ ఇవ్వాలనుకున్నా. నెగెటివిటీ, ఫాల్స్ రూమర్స్ తో విసిగిపోయా. నేను రీతూని వాడుకున్నా, రీతూ నన్ను వాడుకుందనే నెరేటివ్స్ లో నిజం లేదు. బిగ్ బాస్ హౌస్ లో జరిగేది వేరు, రియల్ లైఫ్ లో జరిగేది వేరు. ఎవరూ ఎవరినీ వాడుకోలేదు.. ఇది మ్యూచువల్ ఫ్రెండ్షిప్. మా ఇద్దరికీ స్ట్రెంత్స్, వీక్ నెస్ లు ఉన్నాయి" అని పవన్ వివరణ ఇచ్చాడు.

"మేము గతంలో కలిసి వర్క్ చేశాం, మంచి బాండ్ షేర్ చేసుకున్నాం. కానీ ఏ ఫ్రెండ్షిప్ లో అయినట్లు మాకు కూడా చాలా నెలలుగా పర్సనల్ ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతిసారీ నేను అర్థం చేసుకుని సార్ట్ అవుట్ చేయాలని ట్రై చేశా, కానీ విషయాలు కంట్రోల్ తప్పుతున్నాయి. గొడవలు పెద్దవి అవుతున్నాయి, అందుకే శాంతి కోసం విడివిడిగా మా ప్రాజెక్ట్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పాడు.

 బ్రేకప్ కి కారణం కూడా పవన్ చెప్పాడు. "ఆమె నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసి స్నాప్ చాట్ లో రిమూవ్ చేసింది. నాకు అది నచ్చలేదు కాబట్టి నేను ఇన్‌స్టాలో ఆమెను రిమూవ్ చేశా, ఇప్పుడు ఆమె కూడా నన్ను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది. నేను ఎలాంటి పోస్టులు డిలీట్ చేయలేదు. దయచేసి శాంతిని మెయింటైన్ చేయండి, మీ సపోర్ట్ కి థాంక్స్" అని ఎమోషనల్ గా ముగించాడు. దీంతో RiVan ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com