Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్నకు కాంచన బిగ్ షాక్.. దీపను వెంటబెట్టుకుని పుట్టింటికి ఎంట్రీ!

May 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -674 లో.... జ్యోత్స్న ఇంటికి వచ్చి బోర్డు మీటింగ్ లో జరిగిన ఒప్పందం గురించి కాంచనకి జ్యోత్స్న చెప్తుంది. ఈ ఒప్పందానికి ఎలా ఒప్పుకున్నారని కాంచన కోప్పడుతుంది. బావ లేట్ అవుతుందని కార్తీక్ బ్యాగ్ తీసుకొని జ్యోత్స్న వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. కార్తీక్ చెయ్ పట్టుకొని జ్యోత్స్న వెళ్తుంటే కాంచన,  దీప కోపంగా చూస్తారు. ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ ఇంటికి వెళ్తారు. పారిజాతం ఏం తెలియనట్లుగా అసలు నువ్వు ఏం చేస్తున్నావే వాళ్ళని ఎలా విడదీయాలని అనిపించిందని పారిజాతం అంటుంది.

ఒప్పందం తెలిసి మీ అమ్మ నీపై కోపంగా ఉందని పారిజాతం చెప్తుంది. లోపలికి వెళ్లేసరికి అందరు కోపంగా ఉంటారు. ఇక సుమిత్ర కన్విన్స్ అయ్యేలాగా జ్యోత్స్న మాట్లాడుతుంది. మరొకవైపు కాంచన బాధపడుతుంటే దీప వస్తుంది. డబ్బు కోసం మొగుడిని అమ్ముకున్న ఆడదాన్ని చూసాను కానీ ఇలా పదవి కోసం మొగుడిని ప్రియురాలు దగ్గరికి పంపడం నేను ఎక్కడ చూడలేదని కాంచన అంటుంది. అప్పుడే దీప ఫోన్ కి దశరథ్ ఫోన్ చేస్తాడు. నా చెల్లికొకసారి ఫోన్ ఇవ్వమ్మ అంటాడు. ఏంటి అన్నయ్య నీ కూతురు చేసే పని అని తన బాధని చెప్తుంటే శివన్నారాయణ, దశరథ్ ఎమోషనల్ అవుతారు. నా కూతురు తెల్లారేసరికి నవ్వుతు మాట్లాడాలని శివన్నారాయణ అంటాడు.

మరుసటి రోజు మొదటి రోజు సీఈఓగా ఆఫీస్ కి వెళ్తున్నందుకు జ్యోత్స్న రెడీ అవుతుంది. దీప కూడా వస్తుంది కదా అని పారిజాతం అంటుంది. వస్తే ఈ గుమ్మాన్ని పట్టుకొని ఏడుస్తుందో అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దీప, కాంచన ఎంట్రీ ఇస్తారు. మీరెందుకు వచ్చారని జ్యోత్స్న అనగానే నా కూతురిని అలా అడుగుతావా అని శివన్నారాయణ కోప్పడతాడు. నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంపు కి వెళ్ళాడు. నా కోడలిని తీసుకొని నా పుట్టింట్లో ఉండడానికి వచ్చానని కాంచన అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com