.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక్ దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -688 లో...... సుమిత్రకి పుట్టినరోజు కానుకగా హాస్పిటల్ బెడ్ పై అమ్మ పక్కన కూతురున్న బొమ్మని డ్రాయింగ్ గిఫ్ట్ గా దీప ఇస్తుంది. అది చూసి సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరు గీశారని సుమిత్ర అడుగుతుంది. అమ్మ చెప్తుంటే నేనే గీసానని శౌర్య అంటుంది. ఒకసారి ఇటు ఇవ్వు అని జ్యోత్స్న తీసుకోబోతుంటే ఆ పేపర్ కింద పడుతుంది. అప్పుడే దక్షిణమూర్తి వచ్చి ఆ పేపర్ తీస్తాడు. తనని చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు.
ఎందుకు వచ్చావని దక్షిణామూర్తిని శివన్నారాయణ కోప్పడతాడు. నేను రావడానికి రెండు కారణాలున్నాయి.. ఒకటి నన్ను కాపాడిన నీకు, దీప, కార్తీక్ లకి థాంక్స్ చెప్పాలని వచ్చానని దక్షిణామూర్తి అంటాడు. అవసరం లేదని అతడిని శివన్నారాయణ కోప్పడతాడు. నేను వచ్చిన రెండో కారణం నా కూతురు పుట్టినరోజు కాబట్టి దక్షిణమూర్తి డ్రైవర్ ని పిలుస్తాడు. అతను అక్షింతలు తీసుకొని వస్తాడు. అవి సుమిత్ర మీద వెయ్యబోతుంటే శివన్నారాయణ వద్దని తన చెయ్ పక్కకి నెట్టుతాడు. దాంతో అక్షింతలు సుమిత్ర మీద పడుతాయి. ఆ తర్వాత ఎందుకు వచ్చావని సుమిత్ర కోప్పడుతుంది. అతను ఇక్కడికి పిలిస్తేనే వచ్చారని జ్యోత్స్న అనగానే ఎవరు అని శివన్నారాయణ అడుగుతాడు. దీప అని జ్యోత్స్న చెప్పగానే నేను పిలవలేదని దీప అంటుంది. నువ్వు దక్షిణామూర్తి తాతని పిలిస్తే బాగుండు అనుకున్నారు కదా అని జ్యోత్స్న అనగానే అనుకున్నాం కానీ అని దీప ఏదో చెప్పబోతుంటే శివన్నారాయణ కోప్పడతాడు.
నన్ను ఎవరు పిలవలేదు.. ఒకరు పిలిస్తే రావడానికి ఒకరు పిలిస్తే వెళ్ళడానికి నేనేం పరాయి ఇంటికి రాలేదు.. నా ప్రాణ స్నేహితుడు ఇంటికి నా కూతురు ఇంటికి వచ్చానని దక్షిణామూర్తి అంటాడు. అమ్మ సుమిత్ర నీ అన్నయ్య వదిన ఇప్పటికి నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి దక్షిణామూర్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జరిగింది మర్చిపోయి కేక్ కట్ చెయ్యండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తుంది. దీపకి తినిపించబోతుంటే జ్యోత్స్న మమ్మీ అని పిలిచి సుమిత్రకి తినిపిస్తుంది. అలా దీపకి సుమిత్ర కేక్ తినిపించకుండా జ్యోత్స్న మిస్ అయ్యేలా చేసినా.. చివరికి దీపకి తినిపిస్తుంది సుమిత్ర. ఆ తర్వాత దీప ఈ రోజు తప్పించుకుందని పారిజాతం అనగానే ఆఫీస్ లో వదలను కదా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
