
కూకు విత్ జాతి రత్నాలు షో ఈ వారం ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్, యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. జడ్జెస్ కూడా పడీ పడీ నవ్వుకున్నారు. వీళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ కి అలీ ఇంకా ఖుషీ ఐపోయాడు. "వంటల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటే మమ్మల్ని అందరినీ నవ్వించడంలో మీరు బిజీగా ఉన్నారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరంతా బాగా చేశారు. అద్భుతం. ఈ సమయంలో నేను మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా" అంటూ నిజంగానే ఒక స్పెషల్ గిఫ్ట్ ఐతే తెచ్చారు. అసలే ఫారెస్ట్ థీమ్ తో వచ్చిన ఈ ఎపిసోడ్ దానికి తగ్గట్టే పచ్చటి ఆకులన్నిటితో కలిపి ఒక పెద్ద దండను తయారుచేసి తెచ్చారు.
ఆ మూడు దండలను ముగ్గురు జడ్జెస్ కి ఇచ్చారు అలీ. వాళ్ళు కూడా ఈ ముగ్గురి మెడలో వేశారు. అంతే కాదు ఈ ముగ్గురికి తలా ఒక 500 ఇచ్చారు అలీ. ఇక ఈ కమెడియన్స్ కూడా అదే మహాప్రసాదంలా కళ్ళకద్దుకున్నారు. "సర్కస్ కూడా మూడు గంటలు నడుస్తుంది. దాంట్లో జోకర్ లేకపోతే సర్కస్ అనేదే లేదు. సో అలాగా ఈ ఈవెంట్ లో మనం గ్రేట్ కమెడియన్స్ అండ్ గ్రేట్ ఎంటెర్టైనెర్స్ . మనం మన సీనియర్స్ ని చూసి నేర్చుకున్నాం. ఇలాగే కంటిన్యూ చేయండి. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ " అంటూ మెచ్చుకున్నారు.
ఇక హరి ఐతే "మీలాంటి లెజెండ్ కమెడియన్ మమ్మల్ని ఇలా మమ్మల్ని ఇలా ప్రోత్సహించడం మమ్మల్ని ఇలా పొగగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 500 నాకు ఒక కోటి రూపాయలుగా అనిపిస్తోంది. ఇది నోట్ కాదు ఇందులో నాకు ఆనందం కనిపిస్తోంది, ఒక గుర్తింపు కనిపిస్తోంది. ఈ డబ్బు దాచుకుంటాను " అని చెప్పాడు. ఇక యాదమ్మ రాజు ఐతే "నేను హరి అంత మాట్లాడలేను కానీ థాంక్యూ సో మచ్ సర్. మీరే నాకు ఇన్స్పిరేషన్ సర్. మీరు మాకు చాలామంచి గిఫ్ట్ ఇచ్చారు. అది చాలు సర్ మాకు. ఇక జడ్జి శ్రీదేవి ఐతే "మీరు జాతిరత్నాలు కాదు ఆణిముత్యాలు" అన్నారు.





.webp)
