Home

»

Tv News

‘గిల్లితే గిల్లించుకోవాలి’.. విష్ణు ప్రియతో అంబటి అర్జున్

Oct 6, 2026 1:04PM

చెఫ్ మంత్ర  లేటెస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇందులో సుమ పారడైజ్ మూవీలో నాని గెటప్ లో రెండు జాడలు వేసుకొచ్చింది. రాగానే దిష్టి కూడా తీసుకుంది ."ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కూరలన్నీ కటకటా , పోపులన్నీ పటపటా దిష్టి అంతా పోవాలి " అంటూ పారేసింది. ఇక నందిని రెడ్డి కూడా వచ్చారు. రాగానే కత్తిని తన గుండెల్లో దింపుకొని  వెళ్లిపోతున్నా సుమ అనేసరికి "సినిమాలు వదిలేసి వెళ్ళిపోతారు " అనేసింది సుమ. "మధ్యలో సినిమా ఎందుకొచ్చింది " అన్నారు నందిని రెడ్డి.

"సినిమాలోని క్యారెక్టర్ లను మన వాళ్ళు వేసుకుని వస్తుంటే " అని సుమా చెప్పేంతలో అర్జున్ రెడ్డి గెటప్ లో యష్మిని తీసుకుని యాదమ్మ రాజు విగ్గు పెట్టుకుని వచ్చేసాడు. "ఈరోజు నేను గనక వంట సరిగా చేయకపోతే స్టూడియోలో బట్టలిప్పి తిరుగుతా మేడం " అంటూ పెద్ద శపధం చేసేసాడు. దాంతో సుమ షాకై సిగ్గుపడిపోతూ నందిని రెడ్డి దగ్గరకు వెళ్ళిపోయింది. "రేయ్ దణ్ణం పెడతా నీకు వద్దొద్దు "అన్నారు నందిని రెడ్డి.  తర్వాత అంబటి అర్జున్ ప్రకాష్ రాజ్ గెటప్ లో వచ్చి "గిల్లితే గిల్లించుకోవాలి "అన్నాడు. తర్వాత ఇమ్మానుయేల్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీలోని ప్రకాష్ రాజ్ గెటప్ లో వచ్చాడు. తర్వాత సిద్దు - సోనియా దళపతి మూవీలో రజనీకాంత్ - శోభన గెటప్ లో వచ్చారు. "మా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది " అని సిద్దు అడిగాడు. "ఇది దళపతిలా లేదు. తలుపు తియ్ " లా ఉంది అన్నాడు అంబటి అర్జున్ .

ఇక తర్వాత ఆటం బాంబులు వచ్చాయి. రాధికా గెటప్ లో విష్ణుప్రియ బ్లాక్ శారీలో వచ్చింది. ఏం మావ చేసావే మూవీలో సమంత గెటప్ లో రీతూ వచ్చింది. ఇక ఇమ్ము వచ్చి "బాగుందిరా పిల్లా చిన్నోడికి బాగుంటుంది అనుకుంటా" అంటూ విష్ణు ప్రియా గురించి అనేసరికి అంబటి అర్జున్ వెంటనే "చిన్నోడికంటే నాకే బాగుంటుంది " అంటూ విష్ణు చేతి మీద గిల్లాడు. "గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు " అన్నాడు. "అది గిల్లితే నువ్వు అరుస్తావ్ " అంటూ అర్జున్ కి కౌంటర్ ఇచ్చాడు ఇమ్ము.  చివరిలో ఇమ్ము "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే " అబ్బా ఎంత పదమమ్మా అన్నాడు. వెంటనే విష్ణు ప్రియా "నా ఒంటిలో దుప్పట్లే " అనేసింది. "దుప్పట్లేనా దిండ్లు కూడా ఉన్నాయా " అంటూ ఇమ్ము ఒక రొమాంటిక్ కౌంటర్ ఇచ్చాడు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com