Home

»

Tv News

జాతర స్పెషల్ తో సుమ మాస్ ఎంటర్టైన్మెంట్ .. చిన్నారులతో కిచెన్ లో రచ్చ

Sep 28, 2026 10:10AM

చెఫ్ మంత్ర సీజన్ 6 ఎప్పటిలాగే ఈ వారం కూడా డబుల్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతోంది. గురువారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో రాను రాను అంటూనే సిన్నదో అనే సాంగ్ తో సుమ ఎంట్రీ ఇచ్చింది. మైక్ ఇస్తేనే మనకు జాతర, అలాంటిది థీమే జాతర అయితే ఇంకా ఎలా ఉంటుంది అంటూ సుమ తన మార్క్ పంచులతో స్టార్ట్ చేసింది. సుప్రీత, యాదమా రాజు, అంబటి అర్జున్, అమర్ దీప్, ఇమాన్యుయేల్ డాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. ఏంటి యాదమా రాజు ఒక్కడివే ఎంట్రీ ఇచ్చావ్ అని సుమ అడగడంతోనే ప్రోమోలో ఫన్ మొదలైంది.

కావ్యకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, నాకు జోడిగా కావ్యనే కావాలని  యాదమా రాజు అనగానే అప్పుడే యష్మి  ఎంట్రీ ఇచ్చింది. లడ్డు కావాలా నాయనా అని బ్యాక్ గ్రౌండ్ లో వినిపించగానే అందరూ నవ్వేశారు. నా గురించి జోడి అని యాదమా అనగానే అదేంటి నువ్వు ఇందాక కావ్య తప్ప మరెవరిని చూడనన్నావని  సుమ పంచ్ వేసింది. హూ ఈజ్ కావ్య అని యాదమా రాజు అనగానే అందరూ పగలబడి నవ్వారు. అర్జున్, అమర్ దీప్ తో యష్మి డాన్స్ చేస్తుంటే జోడి నా గురించా వాళ్ల గురించా అని యాదమా అనడం, ప్లేట్ నాకు అన్నం వాళ్లకా అని అనడంతో అందరూ నవ్వేశారు.

ఆ తర్వాత పెద్ద దండ వేసి జడ్జి నందిని రెడ్డిని ఆహ్వానించారు. మా ఊళ్లో జాతరకు ఒక పెద్ద మేకపోతును తీసుకొని వస్తారు బలి ఇవ్వడానికి, నేను పెద్ద మేకపోతు నువ్వు చిన్న మేకపోతు అని సుమతో నందిని అంటుంది . ఈ రోజు కుత్తు పరోటా వంటలక్కం అని నందిని చెప్పగానే కుత్తు అంటే ఇలా ఉంటుంది అని విష్ణు బీభత్సంగా చూపించింది. ఈ రోజు ఎందుకో నాకు ధైర్యం సరిపోవడం లేదు సుమా అని నందిని భయపడుతుంటే పెద్దవాళ్లకు చిన్న పిల్లల వంట చేస్తుంటే ఎలా ఉంటుంది, వాళ్లు చేసి తినిపిస్తారని సుమ చెప్పింది. ఒక్కో టీంలో ఒక్క చిన్న బాబు లేదా పాప ఉంటారని తెలిపింది.

చిన్న పిల్లల అల్లరితో సెట్ కిక్కిరిసిపోయింది. ఆద్యా నేను చిన్నప్పుడు నీలాగే ఉన్నాను తెలుసని విష్ణు అనగానే పెద్దయ్యాక నేను నీలాగే ఉంటానా అని విరక్తిగా ఆద్య అనడంతో అందరూ నవ్వారు. రీతూ, విష్ణు ప్రియ మాస్ డాన్స్ తో అదరగొట్టారు. ఒక్కో టీంలో చిన్న పిల్లలు వంట చేస్తుంటే వాళ్లతో సుమ యాడ్ అయి ఎంటర్టైన్మెంట్ చేసింది. జాతర థీమ్, చిన్నారుల క్యూట్ వంటలు, సుమ కామెడీతో ఈ వారం చెఫ్ మంత్ర డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com