Home

»

Tv News

చెఫ్ మంత్రలో ఎమోషనలైన రీతూ.. స్ట్రాంగ్‌గా ఉండి అలసిపోయా అంటూ కన్నీళ్లు!

Oct 12, 2026 6:14PM

చెఫ్ మంత్ర ప్రాజెక్ కే లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో రీతూ ఫుల్ కలర్ ఫుల్ కాస్ట్యూమ్ తో వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఐతే విష్ణు ప్రియా, రీతూ చాలా జిగిరి దోస్తులను అందరికీ తెలుసు. ఐతే ఏమయ్యిందో కానీ కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత రీతూ - డీమన్ పవన్ గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కుకింగ్ షోలో తన ఫ్రెండ్ విష్ణుప్రియతోనే జోడిగా వంటలు చేస్తోంది రీతూ. ఇక రీసెంట్ ఎపిసోడ్ లో రీతూ తన బాధ మొత్తాన్ని బయటపెట్టి ఎమోషనల్ ఐపోయింది.

"ఒక రిలేషన్ షిప్ బ్రేకప్ కంటే ఫ్రెండ్ షిప్ బ్రేకప్ అవడమే చాలా పెయిన్ ఫుల్. ఇన్ని రోజులు ఫ్రెండ్ షిప్ చేసిన వాళ్ళే విక్టిమ్ కార్డు, ఒక సింపతీ కార్డు ప్లే చేస్తే తీసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తోంది. వంద సార్లు ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకుని వంద మంది ముందు మాట్లాడినప్పుడు ఒక్కటి కూడా కనిపించదు. చిన్న మిస్టేక్స్ ఆ అమ్మాయి తప్పు. ఆ అమ్మాయి అదే. " అని ముద్ర వేస్తారు  అని చెప్పింది రీతూ. ఇంతలో నందిని రెడ్డి "జనాలు ఎం మాట్లాడుకున్నా నువ్వు ఎఫెక్ట్ అవుతావా" అని అడిగారు.

"డెఫినెట్ గా అవుతాను  ఎందుకంటే నేను కూడా మనిషినే కదా నాకు ఎక్కువ ఐతే దీనికే వచ్చింది. నిన్న రాత్రి కూడా నేను నిద్ర పోలేదు." అని  బాధపడింది రీతూ. ఇంతలో సుమ "నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి " అంది. "నేను ధైర్యంగా ఉండడం అనేది నావల్ల అవ్వట్లేదు. స్ట్రాంగ్ ఉండి ఉండి అలసిపోయాను " అని చెప్పింది. ఆమె బాధను చూసి విష్ణుప్రియ ఓదార్చింది. తర్వాత సుమ వెళ్లి హగ్ చేసుకుని ఆమెకు ధైర్యం చెప్పింది. ఐనా రీతూ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com