Home

»

Tv News

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. శ్రీవల్లిని బయటకు గెంటేసిన చందు!

Apr 04, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -436 లో..... శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న చందు తనని బ్యాగ్ తో సహా పుట్టింటి దగ్గర దింపేస్తాడు. అప్పుడే భాగ్యం, ఆనందరావు రెడీ అయి వస్తుంటే.. బ్యాగ్ తో వస్తున్న శ్రీవల్లి ని చూస్తారు. ఏంటి అమ్మడు మేమే వస్తున్నాం కదా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావ్.. దగ్గరుండి తీసుకొని వెళదామని వచ్చావా అని ఆనందరావు, భాగ్యం అంటుంటే శ్రీవల్లి జరిగింది చెప్తుంది. నా కాపురాన్ని కూల్చేశారని బోరున ఏడుస్తుంది.

ఆ నర్మద ప్రేమ, నిన్ను భయపెట్టడానికి బ్లాక్ మెయిల్ చేశారనుకున్న గానీ ఇలా చేస్తారనుకోలేదని భాగ్యం అంటుంది. వాళ్ళేం చేశారు మనమే తప్పు మీద తప్పు చేసామని శ్రీవల్లి ఏడుస్తుంది. ఆ తర్వాత పూజలో కూర్చోవడానికి పెద్దోడు శ్రీవల్లిని తీసుకొని రమ్మని ప్రేమ, నర్మదలని వేదవతి పంపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లేసరికి అక్కడ వాళ్లుండరు. అప్పుడే చందు వస్తాడు. శ్రీవల్లిని వాళ్ళ పుట్టింట్లో దింపేసి వచ్చాను వాళ్ళ అమ్మ కాలు జారి కిందపడిందని చందు చెప్తాడు.. చందు వెళ్లిపోతుంటే తన వెనకాలే ప్రేమ, నర్మద వెళ్లి ఏంటి బావ.. ఇది తన తప్పు చెప్పి మారుస్తారనుకున్నాం ఇలా చేశారని అంటారు. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి అని చెప్పేసి చందు వెళ్ళిపోతాడు. మరి పూజ మీద నర్మద,సాగర్ కూర్చోండి అని వేదవతి అంటుంది వాడు కూర్చుంటే నేను పూజలో కూర్చోనని రామరాజు అంటాడు. దాంతో సాగర్ కి కోపం వచ్చి పూజ దగ్గర నుండి లేస్తాడు. మరి ప్రేమ, ధీరజ్ మీరు కూర్చోండి అని వేదవతి అంటుంది. నేను దంతో కలిసి కూర్చోనని ధీరజ్ అంటాడు.

అమూల్య విషయంలో ప్రేమ మోసం చేసింది.. నేను తన పక్కన కూర్చొని పూజ చెయ్యలేనని ధీరజ్ అంటాడు. దాంతో ధీరజ్ ని వేదవతి పక్కకి తీసుకొని వెళ్లి.. అసలు విషయాలు నీకు తెలియవు.. ఇప్పుడు చెప్పే పరిస్థితిలో నేను లేనని సర్ది చెప్పి పూజలో కూర్చునేలా వేదవతి చేస్తుంది. ఇద్దరు పూజ చేస్తారు. మరొకవైపు శ్రీవల్లి చేసిన మోసాన్ని చందు గుర్తుచేసుకొని బాధపడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com