Podharillu : కన్నా తండ్రి నారాయణ కాదనే నిజం చెప్పేసిన మహా.. షాక్ లో చక్రి, కేశవ!
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -248 లో.....మనీషాకు బావ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తాడు. మనీషా ఏడుస్తూ బన్సీకి చెబితే మాధవ ఎవరు అని అడుగుతాడు. గతంలో కూడా వచ్చి బెదిరించాడని చెప్తే మాధవ ధైర్యం చెప్తాడు. తను ఉన్నానని, తన కుటుంబం ఉందని, ఇది తమ ఏరియా అని, ఈసారి వస్తే బుద్ధి చెప్పి పంపిస్తానని చెప్పి వెళ్తాడు. మరోవైపు కన్నా తల్లి ఇచ్చిన బొమ్మను అతికించి టేబుల్ పై పెడితే మళ్లీ కిందపడి పగిలిపోతుంది. అది నారాయణే కావాలని చేశాడని భావించి అందరి ముందే కాలర్ పట్టుకుని నిలదీస్తాడు.
మా అమ్మను ఇంట్లో నుంచి వెళ్లగొట్టావ్, కనీసం బొమ్మనైనా ఉండనీయవా, ఆ అమ్మను చంపావ్, ఈ అమ్మను వెళ్లగొట్టావని వాగుతాడు.మాధవ వారిస్తే అతనికి ఎదురు తిరుగుతాడు. మీ అమ్మ వెళ్లిపోవడానికి ఆయనకు సంబంధం లేదని మహా చెప్తున్నా వినడు. 20 ఏళ్ల తర్వాత వచ్చిన మీ అమ్మ రెండు రోజుల్లో ఎందుకు వెళ్లిపోయిందని మహా అడిగితే గొంతు పట్టుకుని చంపబోవడం వల్లే వెళ్లిపోయిందని కన్నా అంటాడు. నారాయణ ఉండి ఏం లాభం, తాగి తాగి ఏదో రోజు చచ్చిపోతే బాగుండని చూస్తున్నామని అంటాడు. దీంతో మహా ఆవేశంతో రగిలిపోయి కన్నాను చెంపపై లాగిపెట్టి కొడుతుంది.
వేలెడంత లేవు,మహావృక్షంలాంటి మనిషిని చచ్చిపోమంటావా, ఆయనను మనిషి కాదంటే దేవుడిని దేవుడు కాదు అన్నట్లే అని మహా అంటుంది. చక్రి, కేశవ అడ్డుపడితే వాళ్లనూ తిడుతుంది. మీ నాన్నను అన్నేసి మాటలు అంటుంటే మీరు ఏం అనరా, ఆయన చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు.. ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఇంటి పెద్ద నారాయణే, ఆయనను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదు అని తేల్చి చెప్తుంది. కన్నా వెనక్కి తగ్గక ఇంట్లో నుంచి వెళ్లిపోతానని వెళ్లిపోతాడు. నారాయణ కన్నా వెంట వెళ్తే చక్రి, కేశవ కూడా వెళ్తే మహా అడ్డుపడుతుంది. దీంతో మహాతో చక్రి గొడవపడతాడు. వాడేదో చిన్న పిల్లాడు వాగితే అలా కొడతారా.. మీరంటేనే వాడికి ఇష్టం అని అంటాడు.
మహా ఏం చేసినా అందులో అర్థం ఉంటుందని మాధవ అంటాడు. ఆ కోపం వెనక అధికారం ఉందా, మందలింపు వెనక మమకారం ఉందా అని చక్రి అడుగుతాడు. మాధవ వద్దంటున్నా మహా అసలు నిజం చెప్పేస్తుంది. మనిషి ఔన్నత్యాన్ని చాటిన వ్యక్తి ఆయన, మీరంతా నాన్న అనకుండా ఆ మనిషి అంటున్నారే, ఆ మనిషి చనిపోతే బాగుండని కన్నా అన్నాడే, అసలు ఆ మనిషే లేకపోతే కన్నా ఏమయ్యేవాడో ఎవరికీ తెలియదని అంటుంది. అసలు మీరు ముగ్గురు అన్నదమ్ములే, కన్నా మీ తమ్ముడు కాదు, తల్లి వేరు, తండ్రి వేరు, ఆయన లేకపోతే కన్నా అనాథలా బతికేవాడు.. గుజరాత్ లో భర్త వదిలేసిన జమునాబాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆమె నెలల కొడుకును వదిలేసి వెళ్లిపోయిందని చెప్పడంతో చక్రి, కేశవ షాక్ అవుతారు.




.webp)
.webp)
