
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-241 లో.. తల్లి వెళ్లిపోవడంతో కన్నా తల్లడిల్లిపోయాడు. తల్లి వెళ్లిపోడానికి కారణం నారాయణే అని కన్నా నిందిస్తాడు. కాదని మహా చెప్తుంది. నారాయణ బీడీలు తీసుకుని వెళ్తుంటే కన్నా ఆపి మా అమ్మ ఏదని అడుగుతాడు. నాకేం తెలుసని నారాయణ అనడంతో పొద్దున్నుంచి కనిపించట్లేదని మాధవ చెప్తాడు. నాలుగు గంటలకే నిద్రలేచాను అప్పటినుంచి కనిపించట్లేదని మహా అంటుంది. ఇంట్లో ఏమైనా పోయాయేమో చూడండి అంటూ మా అమ్మను దొంగ అంటున్నావా అని కన్నా కోప్పడతాడు.
అది పోతే దరిద్రం పోయినట్లే కానీ పోతూ పోతూ ఏమైనా తీసుకెళ్లిందో చూడండి అని నారాయణ అనడంతో కన్నా నారాయణ పీక పట్టుకుంటాడు. అది ఒకచోట కుదురుగా ఉండే ఆడదే కాదు, ఇంటి ఇల్లాలిగా, బిడ్డకు తల్లిగా గౌరవంగా బతికే ఆడది కానేకాదు అని నారాయణ అనడంతో కన్నా మరింత రెచ్చిపోతాడు. చంపాలనుకుంటే వచ్చిన రోజే చంపేవాడినని నారాయణ అంటాడు. ఇందులో ఆయనకు ఏ సంబంధం లేదని మహా కవర్ చేసినా కన్నా వినడు. నీకు మీ అమ్మ గురించి తెలుసా, పాలు తాగే వయసులోనే వెళ్లిపోయిందని మహాలక్ష్మి అంటుంది.
కన్నా ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయి తల్లికి తను ఇచ్చిన గిఫ్ట్ ముక్కలు కావడం చూసి మరింత కుమిలిపోతాడు. తల్లిని కాలేజీకి తీసుకొస్తానని పందెం కట్టానని చెప్పి బాధపడతాడు. వీళ్ల అమ్మ వేరు మా అమ్మ వేరు అనేది జీర్ణించుకోడానికే నాకు చాలా రోజులు పట్టింది. నాకోసం అమ్మ వచ్చిందనగానే గదిలోకి వెళ్లి డ్యాన్సు చేశానని, కాలేజీకి అమ్మను తీసుకొస్తానని ఫ్రెండ్స్ తో పందెం వేశానని చెప్పి ఏడుస్తాడు. చక్రి, మహా కారులో కాలేజీలో డ్రాప్ చేస్తారు. ఏం ఆలోచించకుండా చక్కగా చదువుకోమని మహా చెప్తుంది.
మహా చక్రికి అసలు నిజం చెప్తుంది. జమున దొంగతనం గురించి మొత్తం చెప్తుంది. వాళ్ల అమ్మ కన్నా కోసం రాలేదు.. డబ్బుకోసం వచ్చింది.. పెద్ద మోసగత్తే అని రాత్రి జరిగిందంతా చెప్తుంది. కన్నా తల్లి మోసగత్తే అని తెలిస్తే వాడు తట్టుకోగలడా అని మహా అంటుంది. జమున ఇంటికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది. మరోవైపు మాధవకు మనీషా భోజనం తీసుకొచ్చి ఇష్టమైనవాళ్లకు ఏం ఇష్టమో తెలుసుకోవాలిగా అంటూ ప్రేమగా మాట్లాడుతుంది. చివర్లో ఇంట్లో మళ్లీ తల్లి కోసం ఏడుస్తూ నారాయణనే నిందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
