Home

»

Tv News

 సిరిని సేవ్ చేసిన రాజ్, ఇందు.. నిజం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్న అపర్ణ!

Oct 3, 2026 10:01AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1152 లో....సిరిని వెతుక్కుంటూ వెళ్లిన రాజ్, ఇందులకు ఒక చోట సిరి కనబడుతుంది. ఇందును చూసిన సిరి "అక్కా" అంటూ ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. సిరిని తీసుకుని వస్తున్న ఇందును రౌడీలు చుట్టుముడతారు. ఒరేయ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చిందని నవ్వుకుంటారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇచ్చి రౌడీలను చితకబాది ఇందు, సిరిలను సేవ్ చేస్తాడు. అందరు కలిసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రేఖ తన ప్లాన్ ప్రకారం పోలీసులను పిలిపిస్తుంది.

దుగ్గిరాల ఇంట్లోకి పోలీసులు రావడంతో సుభాష్, అపర్ణ షాక్ అవుతారు. ఎందుకొచ్చారని సుభాష్ అడిగితే తనే పిలిపించానని రేఖ చెప్తుంది. సిరి కనిపించకపోవడానికి నేనే కారణం అన్నారు కదా.. అదే తేలుద్దామని పిలిపించానంటూ రేఖ కవర్ చేస్తుంది. మనం ఏమీ అనకుండా సైలెంట్ గా ఉందామని సుభాష్ అపర్ణ డిసైడ్ అవుతారు. పోలీసులు రేఖ చెప్పిన దాని ప్రకారం "రాజ్ ఎక్కడికి వెళ్లారు? ఆ సిరి ఎవరు?" అని అపర్ణను ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అపర్ణ మౌనంగా ఉంటుంది. మీ మనవడే సిరిని ఏమైనా చేసి ఉండొచ్చు కదా? మీ మనవడిని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేయాల్సి వస్తుందని పోలీసు బెదిరిస్తాడు.

అప్పుడే సిరిని తీసుకుని ఇందు, రాజ్ ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన శేషు.. అల్లుడు అంటే అల్లుడే, సాధించాడని మనసులో అనుకుంటాడు. దీన్ని వీళ్లు ఎలా పట్టుకున్నారని రేఖ షాక్ అవుతుంది. ఈ ప్లాన్ కూడా గోవిందా అని భ్రమరాంబ అనుకుంటుంది.  రేఖ ఏదో మనసులో పెట్టుకుని ఇలా చేసింది, మీరు వెళ్లిపోండి అని ఎస్సైతో రాజ్ చెప్తాడు. ఎస్సై కోపంగా రేఖకు వార్నింగ్ ఇచ్చి.. మళ్లీ ఇలా ఫేక్ కంప్లైంట్ ఇస్తే ఊరుకోనని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో రేఖ ప్లాన్ మళ్లీ బెడిసికొడుతుంది.

పోలీసులు వెళ్లిపోగానే అపర్ణ కోపంగా ఇందును నిలదీస్తుంది. అసలు సిరి ఎవరు? ఒకవేళ సిరి దొరక్కపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇంత జరిగినా నిజం చెప్పడం లేదంటూ ఇందు చేయి తీసి తన తల మీద పెట్టుకుని.. రాజుకు సిరికి సంబంధం ఏంటి.. నిజం చెప్తావా అని అడుగుతుంది. దీంతో ఇందు అసలు నిజం చెప్తుంది. నానమ్మ ఆగు, సిరిని బావ పెళ్లి చేసుకోలేదు.. అసలు తనకు బావకు ఏ సంబంధం లేదు. ఒకరోజు అనుకోకుండా బావ సిరి వాళ్ల బండిని యాక్సిడెంట్ చేశాడు. ఆరోజు సిరి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో తన భర్తగా బావ సంతకం చేశాడు. ఆ యాక్సిడెంట్ లో సిరి వాళ్ల నాన్న చనిపోయాడు. బావ వల్లే చనిపోయాడని బావ చాలా బాధపడుతున్నాడని జరిగిందంతా చెప్తుంది. బావ అందరికి చెప్పుదాం అన్నాడు, నేనే వద్దన్నానని.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకుంటుంది. అపర్ణ ఎమోషనల్ అవుతూ రూంలో సిరిని ఓదారుస్తున్న రాజ్ దగ్గరకు వెళ్లి.. సారీ రాజ్, నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను.. ఒక అమ్మాయి జీవితం కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావా? నీది చాలా గొప్ప మనసు అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com