.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1160లో .. ఒక వైపు ఐశ్వర్య పెళ్లి డ్రామాతో దుగ్గిరాల కుటుంబాన్ని షాక్ కి గురి చేస్తే, మరో వైపు స్వాతి, మదన్ ల ఎమోషనల్ సీన్ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ముఖ్యంగా జాబ్ రాని బాధలో ఉన్న మదన్ కి స్వాతి ఇచ్చిన భరోసా, ఆ కేర్ కి మదన్ ఫిదా అవుతాడు.
లక్కీ, ఐశ్వర్య పెళ్లి గురించి దుగ్గిరాల ఇంట్లో చర్చ జరుగుతుంది. బంధువులను ఎలా పిలవాలి.. పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలని అందరు మాట్లాడుకుంటుండగా ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు నాకు ఈ తతంగాలేం వద్దు.. నాకు ఈ పెళ్లి ఇంట్లోనే సింపుల్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరగాలని కండీషన్ పెడుతుంది. నా ఫ్రెండ్స్ సర్కిల్ లో నా రేంజ్ ఏంటో అందరికీ తెలుసు.. ఇలాంటి వాడిని చేసుకుంటున్నానని తెలిస్తే నా రెస్పెక్ట్ పోతుంది.. అందుకే ఎవరికి తెలియకుండా పెళ్లి చేయండి అని అంటుంది. పెళ్లి అంటే ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారని పంతులు చెప్పినా వినదు. నన్ను చేసుకోవాలంటే రేపే చేసుకోమనండి, గ్రాండ్ గా చేయాలంటే ఇంకెవరినైనా చేసుకోమనండి అంటూ తెగేసి చెప్తుంది. అంతే కాదు మెడలో మూడు ముళ్లు పడేసరికి నా చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ పడాలని మరో కండీషన్ పెడుతుంది. దీంతో సుభాష్, అపర్ణ అసంతృప్తిగా ఉన్నా చేసేది లేక ఒప్పుకుంటారు.
మరోవైపు స్వాతి, మదన్ ల లైఫ్ సాగుతోంది. ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన స్వాతి ఇంటికి రాగానే మదన్ అలసిపోయి సోఫాలో పడుకుని ఉండటం చూస్తుంది. వెంటనే వెళ్లి నిద్ర లేపి టీ ఇచ్చి కేర్ తీసుకుంటుంది. నీ ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడగ్గా మదన్ డల్ గా ఉంటాడు.. బహుశా జాబ్ రాలేదేమో అని అనుకొని మదన్ ఫీల్ అవుతాడు. అప్పుడే నాకు జాబ్ వచ్చింది బావా అని స్వాతి సంతోషంగా చెప్తుంది. తనకు జాబ్ రాకపోయినా స్వాతికి జాబ్ వచ్చిందని తెలిసి మొదట కొంచెం ఫీల్ అయినా వెంటనే తేరుకుని కంగ్రాట్స్ చెప్పి హత్తుకుంటాడు.
తర్వాత మదన్ తన బాధను బయటపెడతాడు. ఇకపై ఇంటి ఖర్చులు నేనే చూసుకుంటా, నీకు నచ్చిన జాబ్ వచ్చే వరకు ట్రై చేయొచ్చని స్వాతి చెప్పడంతో మదన్ ఎమోషనల్ అవుతాడు. ఈ జనరేషన్ లో డబ్బుందని పెళ్లి చేసుకుని, డబ్బు అయిపోయాక హ్యాపీగా లేమని రకరకాల కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు.. కానీ నువ్వు నేను ఏం ఇవ్వగలనో ఆలోచించకుండా నన్ను నమ్మి వచ్చేశావు. ఇప్పుడు నా భారమంతా నువ్వే మోస్తున్నావని గిల్టీగా ఫీల్ అవుతాడు. దీనికి స్వాతి మనిద్దరం ఒక్కటే కదా బావా.. నాకు నువ్వు ఇచ్చే ప్రేమ చాలు, ఈ జాబ్, డబ్బు, స్టేటస్ వస్తాయి పోతాయి.. ప్రేమ ఒక్కటే చచ్చే దాకా ఉంటుందని చెప్తుంది. ఆ మాటలకు మదన్ కరిగిపోయి స్వాతిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. స్వాతి కేర్ కి మదన్ ఫిదా అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
