Home

»

Tv News

Brahmamudi: మేనేజర్ చేత నిజం ఒప్పించిన రాజు.. అబద్ధపు పెళ్లి అని చెప్పిన లక్కీ !

Oct 28, 2026 12:10PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1173 లో.....రాజు, ఇందు డాక్టర్ వేషంలో నటించే యాక్టర్ తో ప్లాన్ వేస్తారు. రెస్టారెంట్ లో వెంకీ మేనేజర్ ని కలుస్తారు. ఐశ్వర్యకు డీల్ చేసింది నేనే, ఆ దుగ్గిరాల ఇంట్లో ఫ్రాడ్ ఎవరైనా ఉంటే ఐశ్వర్య, పక్కా 420 మెటీరియల్ అని మేనేజర్ అంటాడు. కొంతమంది అమాయకులను తీసుకుని వాళ్లదే నేరమని రుజువు చేస్తాం, అలా వెంకీని చేశామని ఒప్పుకుంటాడు. ఇందు ఇచ్చిన జ్యూస్ తాగగానే రాజు బయటకు తీసుకెళ్లి కొట్టి ..నీ జ్యూస్ లో పాయిజన్ కలిపాం, కాసేపట్లో చనిపోతావని  బెదిరిస్తాడు. డాక్టర్ వచ్చి .. యాంటీ డోట్ కావాలని అంటాడు.

యాంటీ డోట్ నా తమ్ముడి దగ్గర ఉందని చెప్పి అందరూ వెంకీ దగ్గరకు వెళ్తారు. మేనేజర్ వెంకీ కాళ్లు పట్టుకుని.. ఈ నీచుడిని క్షమించు, నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయని వేడుకుంటాడు. చలపతి, లక్ష్మి కూడా కాళ్లు పట్టుకుంటాడు. ఆ కేసుతో వెంకీకి సంబంధం లేదు, అదంతా ఐశ్వర్య చేసిందని ఒప్పుకుంటాడు. వెంకీ ఇచ్చిన చీటీలో పోలీస్ స్టేషన్ అడ్రస్ ఉంటుంది. అక్కడికి వెళ్లి తప్పు ఒప్పుకుంటే యాంటీ డోట్ దొరుకుతుందని రాజు అంటాడు.

నందు దగ్గరకు వెళ్లి మేనేజర్..వెంకీని కావాలనే ఇరికించా, ఐశ్వర్యతో కలిసి డీల్ చేస్తుంటే ఇరికించమని చెప్పింది, ఆధారాలు నా మెయిల్ లో ఉన్నాయని ఒప్పుకుంటాడు. ఇందు.. 10 సెకన్లే ఉన్నాయని కౌంట్ చేయగానే మేనేజర్ కింద పడిపోతాడు. అసలు విషం లేదు, చెమటలు, వణికేలా టాబ్లెట్ ఇచ్చామని రాజు చెప్తాడు . మాట్లాడింది అంతా వీడియో తీసినట్లు చూపిస్తారు. డాక్టర్ యాక్టర్ కి రూ.10 వేలు మేనేజర్ తోనే పంపిస్తారు.

చలపతి ఇంటికి నందు వచ్చి..మేనేజర్ నిజం ఒప్పుకున్నాడు, కేసు కొట్టేశారని చెప్పి వెళ్తుంది. ఇంట్లో ఐశ్వర్యను ఇందు తిడితే ఐశు కొట్టబోతుంది, రాజు అడ్డుకుంటాడు. అప్పుడే లక్కీ ఎదురు తిరిగి.. ఇందును అబద్ధపు పెళ్లి చేసుకుని డబ్బు కోసం రాంగ్ రూట్ లో ఇంట్లోకి వచ్చిన అద్దె మొగుడివి నువ్వు, ఈ ఇందు వీడికి డైలీ పేమెంట్ ఇచ్చి యాక్ట్ చేయిస్తోందని నిజం బయటపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com