Home

»

Tv News

Brahmamudi: నందును గెంటేసిన చలపతి..  రాజు వర్సెస్ లక్కీ!

Oct 27, 2026 10:43AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1172 లో.....జైల్లో ఉన్న వెంకీని రాజు, ఇందు కలుస్తారు. లక్ష్మి ఏడుస్తుండగా  నందుపై  రాజు.. అరెస్ట్ చేసేముందు నాకు ఒక్క కాల్ చేయొచ్చుగా అని కోప్పడతాడు. మా కంపెనీలో గోల్డ్ ఫ్రాడ్ జరుగుతుందని చెప్పాను.. అందుకే ఇరికించారని వెంకీ అంటాడు. ఇది ఐశ్వర్య పనే అని రాజు  ఫైర్ అవుతాడు. వాళ్లను వదలనని నందు అనగానే లాయర్ వచ్చి వెంకీకి బెయిల్ ఇప్పిస్తాడు. వెంకీ రిలీజ్ అవుతాడు.

 

ఇంటికి వచ్చాక రేఖ, భ్రమరాంబ ఐశ్వర్యను పొగుడుతారు. శేషు సెటైర్లు వేస్తాడు. మరోవైపు వెంకీని అరెస్ట్ చేయడంపై చలపతి బాధపడతాడు. నందు ధైర్యం చెప్పడానికి వస్తే చలపతి.. మీరు గొప్పోళ్లు, తప్పులు చేస్తే చిటికెలో మార్చుకుంటారు, మా బతుకులు అలా కాదు, ఇంకెప్పుడూ మా ఇంటి గుమ్మం తొక్కొద్దని అరిచి గెంటేస్తాడు. కేసు నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోతుంది నందు.

 

రాజు ఇంటికి వచ్చి.. నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయించావని  ఐశ్వర్యను నిలదీస్తాడు. ఫ్యామిలీ అంతా దొంగ సొమ్ముకు అలవాటు పడ్డారని భూషణ్  అంటాడు. అన్ని సాక్ష్యాలతో నిన్ను కూడా జైల్లో కూర్చోబెడతానని రాజు  ఛాలెంజ్ చేస్తాడు. మేనేజర్ కి డబ్బు ఆశ, నా ఎదుగుదల చూడలేక ఇరికిస్తున్నారని ఐశ్వర్య బుకాయిస్తుంది.

 

దీంతో ఇందు ప్లాన్ వేస్తుంది. మేనేజర్ కి కాల్ చేసి.. లాభాలు ఐశ్వర్య కంపెనీకేనా, మాకొద్దా, మేము కూడా చేతులు కలపాలనుకుంటున్నామని నమ్మిస్తుంది. రెస్టారెంట్ లో కలవమని పిలుస్తుంది. మరుసటి రోజు డాక్టర్ తో కలిసి రాజు, ఇందు మేనేజర్ దగ్గర నిజం రాబట్టి ఇంట్లో ఐశ్వర్య నేరాన్ని బయటపెడతారు. ఇంకోసారి రిపీట్ అయితే ఇంట్లో స్థానం ఉండదని ఇందు అనగానే  ఇందును ఐశ్వర్య కొట్టబోతుంది. రాజు అడ్డుకుంటే  రాజును లక్కీ అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com