Home

»

Tv News

Brahmamudi : ఇందు, రాజ్ ల పెళ్ళి జరిగితే ప్రాణగండం తప్పినట్టేనా!

Oct 24, 2026 10:31AM

బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-1170 లో.. మీ వంశానికి వారసుడైన రాజ్ ను మృత్యువు నీడలా వెంటాడుతోంది..  ఇన్నాళ్లకు విధి మళ్లీ పాశం విసరబోతోందని స్వామిజీ చెప్పడంతో అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. ఏం చేయాలని అడిగితే..‌ఇప్పటి వరకు ఇందు సాన్నిహిత్యం రాజుకు అండగా నిలిచింది. రాజును కాపాడాలంటే ఇందు మెడలో రాజ్ తాళి కట్టాలి.. దైవబలంతో పాటు ఇందు మాంగల్య బలం తోడుగా నిలుస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటల గురించే ఇందు ఆలోచిస్తూ ఉండగా ఇందును అపర్ణ పక్కకు పిలిచి.. నీ మెడలో తాళి పడితేనే రాజ్ బతుకుతాడని చెప్తుంది.‌ దీంతో ఇందు వారం రోజుల్లో బావను పెళ్లి చేసుకుంటానని మాటిస్తుంది.

 

మరోవైపు రాజ్ ఆఫీస్ కు వచ్చిన వెంకీ.. మా కంపెనీలో ఫ్రాడ్ జరుగుతోంది.. బంగారం క్వాలిటీ బాలేదు.. టెండర్ తక్కువకు వేశారు‌.. ఇందులో ఐశ్వర్య కంపెనీ భాగం ఉందని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయంలో సైలెంట్ గా ఉండమని రాజ్ చెప్తాడు. అటు ఐశ్వర్య మాత్రం ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని క్లయింట్ నుంచి 2 కోట్ల చెక్.. మరో నాలుగు కాంట్రాక్టులు తెచ్చుకుని.. నేను గోల్డెన్ లెగ్, నేను పట్టిందల్లా బంగారమేనని ఇంట్లో హడావుడి చేస్తుంది. రాజ్ ఆమెను నిలదీసి.. కోటి రూపాయలకు తక్కువ టెండర్ వేసి ఇంత తక్కువ టైంలో ఎలా డెలివరీ ఇచ్చావని అడిగితే నన్ను అడగడానికి నువ్వెవరు, వారసుడివా, చైర్మన్ వా, ఇందు అద్దెకు తెచ్చుకున్న మొగుడివా అని ఐశ్చర్య ఎదురు తిరుగుతుంది.

 

రేఖ వెంకీయే ఈ విషయం రాజ్ కి చెప్పాడని గ్రహించి.. రాజ్ నీ మీద ఎంక్వైరీ మొదలుపెట్టేలోగా వెంకీని జైల్లో వేయించమని ఐశ్వర్యకు సలహా ఇస్తుంది. దీంతో ఐశ్వర్య కంపెనీ ఓనర్ తో నందుకు ఫోన్ చేయించి వెంకీని అరెస్ట్ చేయించాలని ప్లాన్ వేస్తుంది. అదే టైంలో ఇందు రాజ్ తో.. ఐశ్వర్య మన పెళ్లి గురించి మళ్లీ కెలుకుతోంది‌.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పెళ్లి ప్రస్తావన తెస్తుంది. రాజ్ మెట్ల మీద పడబోతుంటే ఇందు కంగారుపడుతుంది. చివర్లో రేఖ, భ్రమరాంబ సుభాష్ ను చంపడానికి మెడిసిన్ మార్చేస్తూ ఉండగా అపర్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

SEO Keywords:

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com