
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 1149 లో... రాత్రంతా సిరిని మీ రూంలో ఎందుకు పడుకోబెట్టుకున్నారు.. సిరి గతం మర్చిపోయి ఉండొచ్చు కానీ పెద్ద అమ్మాయి కదా అని అపర్ణ ప్రశ్నిస్తుంది. దీనికి ఇందు.. నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు నాన్నమ్మ, నాకు బావ మీద నమ్మకం ఉంది.. తను ఎప్పటికీ తప్పు చేయడు అని చెప్తుంది. సిరి విషయంలో బావకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాను.. అంతా నేను చూసుకుంటానని ఇందు భరోసా ఇచ్చినా అపర్ణ మాత్రం కంగారుపడుతుంది.
హాల్లో ఐశ్వర్య లోగో డిజైన్ వేసుకుంటుంటే భ్రమరాంబ ఏం చేస్తున్నావని అడుగుతుంది. డిగ్రీ ఫెయిల్ అవుతానని ముందే ఫిక్స్ అయి కంపెనీ జాబ్ కు ప్రాక్టీస్ చేస్తున్నావా అని శేషు వెటకారంగా అంటాడు. దీనికి ఐశ్వర్య కోపంగా.. రేపు నేను పెట్టబోయే కంపెనీ కోసం లోగో డిజైన్ చేసుకుంటున్నానని చెప్తుంది. అప్పుడే వచ్చిన రాజు.. ఆల్లేదు చూల్లేదు అప్పుడే పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టినట్టు ఉందని అంటాడు. నేను పాస్ అవుతాను, ఇందు చేత కంపెనీ పెట్టిస్తానని ఐశ్వర్య అంటుండగానే సిరి పరుగెత్తుకుంటూ వచ్చి లోగో డిజైన్ మీద ఇంకు పడేలా చేస్తుంది. దీంతో ఐశ్వర్య కోపంగా సిరిని కొడుతుంది. రాజు అడ్డుపడి ఐశ్వర్యను తిడతాడు.
సిరి ఇంట్లో ఉంటే అందరికి ఇబ్బందేనని రేఖ వాదిస్తుంది. ఇంట్లో కంపెనీకి సంబంధించిన కోట్ల రూపాయల లావాదేవీల ఫైల్స్ ఉంటాయి. సిరి వాటిని ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది. సిరిని ఏదైనా మంచి హాస్పిటల్ లో చేర్పిస్తే మంచిదని రేఖ సలహా ఇస్తుంది. రాజు మాత్రం.. ఇకపై అలా జరగదు, మేము చూసుకుంటామని చెప్పినా రేఖ వినదు. శేషు కల్పించుకుని రేఖను ఆపి అల్లుడిని వెళ్లిపోమంటాడు. మరోవైపు మదన్ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తాడు. కానీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ నచ్చలేదని వద్దని వచ్చేస్తాడు. ఇంటి ఓనర్ వచ్చి మరో నెల అడ్వాన్స్ ఇవ్వాలని లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
చివరకు సిరిని ఇంట్లోంచి పంపించేయాలని రేఖ ప్లాన్ వేస్తుంది. భ్రమరాంబ, శేషు, భూషణ్, రేఖ నలుగురు కలిసి సిరితో దాగుడుమూతల ఆట ఆడతారు. ముందుగానే రేఖ అరేంజ్ చేసిన కారును అక్కడ పెడతారు. ఆటలో భాగంగా సిరి ఆ కారు ఎక్కగానే డ్రైవర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతాడు. అందరు హ్యాపీగా ఇంట్లోకి వెళ్తారు. తర్వాత ఇందు భోజనం తీసుకుని వచ్చి సిరి కోసం ఇల్లంతా వెతుకుతుంది కానీ సిరి కనిపించదు. భ్రమరాంబ వాళ్లు.. ఇందాక దాగుడుమూతల ఆట ఆడాము, ఎక్కడో దాక్కుందని చెప్తారు. ఇందు కంగారు పడుతుంది. అప్పుడే రాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Brahmamudi Today Episode, Brahmamudi Serial September 29 Episode, Star Maa Brahmamudi Serial




(1).webp)

