.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1158 లో.....రేఖ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. నందు ఎస్సైగా చార్జ్ తీసుకున్న మొదటి రోజే, రేఖ పంపించిన వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. రాజు, సిరి వాళ్ల కుటుంబాన్ని చంపేసి సిరిని పెళ్లి చేసుకున్నాడని, ఆస్తి కోసం దుగ్గిరాల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. తన ఫోన్‌లో ఉన్న రాజు ఫోటో చూపించగానే నందు షాక్ అవుతుంది.ఆ తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చి రేఖకు ఫోన్ చేసి మీరు చెప్పినట్టే చెప్పాను మేడం అంటాడు. పోలీసులు నమ్మారా అని రేఖ అడిగితే ఇమ్మీడియట్‌గా యాక్షన్ తీసుకుంటామన్నారని చెప్తాడు. ఇక రాజు కథ ఆరంభమని రేఖ అనుకుంటుంది. అదే విషయం వెళ్లి భూషణ్‌కు చెప్తుంది.
భూషణ్‌తో రేఖ మాట్లాడుతుంటే సిరి ఆడుకుంటూ వెళ్లి డిస్టబ్ చేస్తుంది. సిరిని భూషణ్ తిట్టి బయటకు గెంటేస్తాడు. అది అపర్ణ చూస్తుంది. సిరి వెళ్లి కింద పడిపోయి తలకు గాయం అవడంతో స్పృహ కోల్పోతుంది. రాజు, ఇందు వచ్చి సిరిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు.
హాస్పిటల్‌లో డాక్టర్ ట్రీట్‌మెంట్ చేస్తుండగా బయట అందరి మధ్య గొడవ జరుగుతుంది. రేఖ వెటకారంగా మాట్లాడితే అపర్ణ కోపంగా అందరిని తిడుతుంది. రేఖ, భూషణ్, భ్రమరాంబ, ఐశ్వర్య ఒకవైపు, అపర్ణ, రాజు, ఇందు ఒకవైపు ఒకరినొకరు నిందించుకుంటారు.
అప్పుడే నందు ఎస్సైగా డైరెక్టుగా హాస్పిటల్ కు వచ్చి రాజు మీద కేసు పెట్టిన విషయం చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చిన ఆదిత్య వచ్చి రాజు మోసం చేసి సిరిని పెళ్లి చేసుకున్నాడని ఏడుస్తూ యాక్టింగ్ చేస్తాడు. భూషణ్ మెల్లగా రేఖతో ఎవరితను భలే యాక్టింగ్ చేస్తున్నాడని అడిగితే స్టేజ్ ఆర్టిస్టు అని రేఖ చెప్తుంది.
నందు రాజును అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుంటే ఇందు అడ్డుపడుతుంది. అప్పుడే సిరి బయటకు వచ్చి ఆగండి అంటూ పిలుస్తుంది. అందరు తిరిగి చూస్తారు. రాజును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని సిరి అడిగితే అందరు షాక్ అవుతారు. అవును రాజు నాకు గతం గుర్తుకు వచ్చిందని సిరి చెప్తుంది. రాజు తప్పు లేదు.. రాంగ్ రూట్‌లో వెళ్లింది మేము అంటూ సిరి మొత్తం చెప్పేస్తుంది. ఆదిత్య ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ఆదిత్య పారిపోతాడు. రాజుకు నందు సారీ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
