Home

»

Tv News

Brahmamudi : లవ్ లెటర్‌తో ఫ్యామిలీ అంతా గందరగోళం.. ఇందు కండిషన్స్ సూపర్!

Oct 18, 2026 8:08AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్  1165 లో...‌దుగ్గిరాల ఇంట్లో అర్ధరాత్రి పెద్ద హంగామా మొదలవుతుంది. అపర్ణ, సుభాష్ వేసిన లెటర్ ప్లాన్ తో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. రాజు, ఇందును కలపాలని అపర్ణ అందరికి లవ్ లెటర్లు పెట్టిస్తుంది. కానీ పనిమనిషి వసంత కోసం శేషు నీట్ గా రెడీ అయి అర్ధరాత్రి బయటకు వస్తాడు. రాజు, ఇందు కారు చాటున కలుసుకుని నువ్వే రమ్మన్నావంటే నువ్వే రమ్మన్నావని గొడవపడతారు. అటు నందు, వెంకీ, రేఖ, భూషణ్ కూడా అదే లెటర్ తో బయటకు వస్తారు. ఒకరిని చూసి మరొకరు దాక్కుంటూ అందరు బయటే ఉండటంతో పెద్ద అయోమయం ఏర్పడుతుంది. అపర్ణ పైనుంచి చూసి తలపట్టుకుంటుంది.

ఈ గందరగోళం మధ్యలో శేషు, వసంత సీన్ భ్రమరాంబ కంట్లోపడుతుంది. కారు వెనుక వసంతతో శేషు సరసాలు ఆడుతుండగా భ్రమరాంబ పట్టుకుని పంచాయితీ పెడుతుంది. తనకు హ్యాండ్ ఇచ్చి పనిమనిషితో తిరుగుతున్నాడని గొడవ చేస్తుంది. దీంతో అందరు పరుగెత్తుకుని వస్తారు. అర్ధరాత్రి ఇంటి పరువు తీసేలా ఏంటి ఇది అంటూ అపర్ణ భ్రమరాంబకు క్లాస్ పీకుతుంది. అయ్యగారే లెటర్ ఇచ్చి రమ్మన్నాడని వసంత అంటే నువ్వే నా అందం చూసి రమ్మన్నావని శేషు అంటాడు. లెటర్ విషయంలో అందరికి గందరగోళం నెలకొనడంతో అపర్ణ కంగారు పడి అందరిని లోనికి తీసుకెళ్తుంది. తన ప్లాన్ ఫెయిల్ అయిందని తెలుసుకుంటుంది.

మరుసటి రోజు ఐశ్వర్య ఆఫీసుకు వెళ్లగా స్వరాజ్ గ్రూప్ ఉద్యోగులు.. శృతి మళ్లీ కనిపించడంతో మండిపడుతుంది. బయటకు నడవండి అంటుంది. అప్పుడే మేనేజర్ వచ్చి ఇందు మేడమ్ మెయిల్ పంపించింది, వీళ్లంతా ఇక్కడే పని చేయాలని.. వీళ్లను తీసే అధికారం.. చెక్కు పవర్ కూడా మీకు లేదు అగ్రిమెంట్ లో ఉందని చెప్పి షాక్ ఇస్తాడు. ఇంటికి వచ్చి ఐశ్వర్య పంచాయితీ పెట్టగా రేఖ, భ్రమరాంబ ఇందుపైకి ఉసిగొల్పుతారు. ఐశ్వర్యలాంటి వాళ్లకు కంపెనీ ఇస్తే మూడు రోజులు కూడా ఉండదు.. తొలిరోజే ఉద్యోగులను తొలగించింది అందుకే కండిషన్లు పెట్టానని ఇందు గట్టిగా సమాధానమిస్తుంది. ఫెయిల్ అయిన ప్లాన్ తర్వాత అపర్ణతో నందు చేతులు కలుపుతుంది. ఇందుపై పూలు కురిపించాలని ప్లాన్ వేస్తే అవి ఐశ్వర్యపై పడి లక్కీకి చెంపదెబ్బ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Brahmamudi Today Episode October 17th, Brahmamudi Serial Star Maa, Duggirala Midnight Letter Drama, Indhu Aishwarya Office Mail Issue]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com